E-Paper
Advertisement

ఎమిరేట్స్ క్యాబిన్ క్రూ సాలరీ.. నెలకు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఎమిరేట్స్ క్యాబిన్ క్రూ సాలరీ.. నెలకు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

ప్రపంచంలోని ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎమిరేట్స్‌ లో క్యాబిన్ క్రూ జీతాలకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో ఫ్లైట్ అటెండెంట్లకు జీతం ఎలా ఇస్తారు? నెలకు ఎంత వరకు సంపాదించే అవకాశం ఉంటుందనే వివరాలు ఉండటంతో నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మూడు విధాలుగా క్యాబిన్ క్రూ సాలరీ

ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసిన వివరాల ప్రకారం, ఎమిరేట్స్ క్యాబిన్ సిబ్బంది నెలవారీ జీతం మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఒకటి బేసిక్ సాలరీ, రెండు ఫ్లైయింగ్ అవర్స్ ఆధారంగా ఇచ్చే అదనపు చెల్లింపు, విదేశీ లే ఓవర్స్ టైమ్ లో అందించే మీల్ అలవెన్సులు. క్యాబిన్ సిబ్బందికి ప్రతి నెల బేసిక్ పే అనేది AED 4,980గా ఉంటుంది. అంటే, భారతీయ కరెన్సీలో ఇది సుమారుగా రూ.1.3 లక్షల వరకు ఉంటుంది. ఉద్యోగి ఎన్ని గంటలు ప్రయాణించినా ఈ మొత్తాన్ని కంపెనీ అందిస్తుంది.

Advertisement

ఇక రెండో భాగం ఫ్లయింగ్ పే. విమానంలో పని చేసిన ప్రతి గంటకు AED 69.6 చొప్పున అడిషనల్ పే అందిస్తారు. సాధారణంగా ఒక క్యాబిన్ సిబ్బంది నెలకు 80 నుంచి 100 గంటల వరకు విమానాల్లో పని చేస్తారు. అందువల్ల వారి మొత్తం జీతం నెలనెలా మారుతూ ఉంటుంది. ఇక మూడో భాగంగా విదేశాల్లో లే ఓవర్ సమయంలో మీల్ అలవెన్స్ లభిస్తుంది. ఏ దేశానికి వెళ్లారు? అక్కడ ఎంతసేపు బస చేశారు? అనే అంశాలపై ఈ భత్యం ఆధారపడి ఉంటుంది. జీతానికి అదనంగా మరికొంత ఆదాయం లభిస్తుంది.

నెలకు సుమారు రూ. 3 లక్షల సంపాదన

ఈ మూడు అంశాలను కలిపి చూస్తే, ఎమిరేట్స్ క్యాబిన్ సిబ్బంది సగటున నెలకు AED 11,244 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. భారతీయ కరెన్సీలో దాదాపు రూ.3 లక్షలకు పైగా ఉండొచ్చు. ఫ్లయింగ్ గంటలు ఎక్కువైతే ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, కొందరు సిబ్బంది కంపెనీ అందించే వసతి సౌకర్యాన్ని ఉపయోగించకుండా సొంత ఇంట్లో ఉంటే, అదనపు అలవెన్సులు కూడా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ట్రాన్స్‌ పోర్ట్ అలవెన్స్ కూడా లభిస్తుంది.

Advertisement

క్యాబిన్ క్రూ సాలరీపై జోరుగా చర్చ

ఈ వివరాలు బయటకు రావడంతో క్యాబిన్ క్రూ జీతాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్యాబిన్ సిబ్బంది ఉద్యోగం కేవలం ప్రయాణాలకు మాత్రమే పరిమితం కాదని, అందులో మంచి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో విమానయాన రంగంలో కెరీర్ కొనసాగించాలనుకునే యువతకు ఈ సమాచారం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Read Also: టైంపాస్ కోసం ఏకంగా విమానాన్ని తయారు చేసిన యూట్యూబర్, నిజంగా వండర్ భయ్యా!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×