IPL 2026 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఫైనల్స్ మరికొన్ని గంటల్లోనే జరగనుంది. అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2) మధ్య ఫైనల్స్ జరగబోతోంది. రేపు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ షురూ అవుతుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లలో ఉచితంగానే ఈ మ్యాచ్ తిలకించవచ్చు. అయితే రేపు సాయంత్రం జరగనున్న ఈ మ్యాచ్ కు ( IPL 2026 Final) వర్షం ( Rain ) అడ్డంకిగా మారే ఛాన్సులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టాస్ పడే సమయానికి దాదాపు 80 శాతం వర్షం ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో రిజర్వుడే ఉంటుందా ? లేదా ? అనే దాని పైన చర్చ జరుగుతోంది. ఐపీఎల్ ఫైనల్స్ కాబట్టి కచ్చితంగా రిజర్వుడే ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మే 31 అంటే రేపు ఫైనల్స్ ఉంది. రేపు వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే… మరో 120 నిమిషాలు అదనంగా సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయానికి కూడా వర్షం తగ్గక మ్యాచ్ జరగకపోతే… కనీసం 5 ఓవర్లైన నిర్వహించే అవకాశాలు ఉంటాయి. అలా జరగకపోతే సూపర్ ఓవర్ నిర్వహించేందుకు రూల్స్ ఉన్నాయి.
వర్షం భారీగా పడి, స్టేడియంలో సూపర్ ఓవర్ కూడా ఆడలేని పరిస్థితి ఉంటే మాత్రం మరుసటి రోజుకు మ్యాచ్ రిజర్వ్ చేయబడుతుంది. అంటే జూన్ 1వ తేదీన మళ్లీ అదే ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. మ్యాచ్ మధ్యలో ఆగిపోతే.. అక్కడి నుంచే షూరు అవుతుంది. జూన్ 1వ తేదీన కూడా మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఉంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విజేతగా ప్రకటిస్తారు. పాయింట్స్ టేబుల్ లో బెంగళూరు అలాగే గుజరాత్ టైటాన్స్ రెండు జట్లకు 18 పాయింట్లు ఉన్నాయి. కానీ బెంగుళూరుకు కాస్త రన్ రేట్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బెంగుళూరు ను చాంపియన్ గా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే వర్షం పడకుండా వరుణ దేవుడికి గుజరాత్ అభిమానులు పూజలు చేస్తున్నారు.