E-Paper
Advertisement

Viral Video: చెప్పు చూపిస్తూ.. బూతులతో రెచ్చిపోయిన మహిళ, ఓపిక నశించి.. అతడు ఏం చేశాడంటే?

Viral Video: చెప్పు చూపిస్తూ.. బూతులతో రెచ్చిపోయిన మహిళ, ఓపిక నశించి.. అతడు ఏం చేశాడంటే?
Advertisement

Indian Train Viral Video: భారతీయరైళ్లలోని జనరల్ కోచ్‌లు సాధారణంగా ఎక్కువ రద్దీతో ఉంటాయి. ప్రయాణికులు ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా, నిలబడే స్థలం కూడా ఉండదు. ఈ కోచ్ లలో సీట్ల కోసం తరచుగా గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు తీవ్రరూపం దాల్చుతాయి. మరికొన్ని సార్లు చిన్న విషయాలకే వాగ్వాదాలు జరగడం చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు జనరల్ కోచ్‌ లో ఒక మహిళ, పురుషుడి మధ్య గొడవ మొదలై, చివరికి కొట్లాట వరకు దారి తీసింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఓ మహిళ చేతిలో చెప్పు పట్టుకుని ఓ వ్యక్తితో గొడవకు దిగుతుంది. అతడు కూల్ గా సమాధానం చెప్తున్నా? ఆమె పట్టించుకోకుండా గట్టి గట్టిగా అరుస్తూ కనిపించింది. కొద్ది సేపటి వరకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అతడు కాసేపటి తర్వాత అక్కడి నుంచి తన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్న వైపు వెళ్లి కూర్చున్నాడు. ఆమెతో గొడవ వద్దు అని డిసైడ్ అయ్యాడు. సదరు మహిళ అక్కడితో ఆగకుండా మరింతగా రెచ్చిపోయింది. అప్పటికీ సదరు వ్యక్తి భార్య ఆమెను సముదాయించే ప్రయత్నం చేసింది. అయినా, ఆమె వినకుండా నోరు పారేసుకుంది. చివరికి వద్దని వారిస్తున్న సదరు వ్యక్తి భార్యపైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది.

మహిళ చెంపలు చెళ్లుమనేలా.. 

Advertisement

తన భార్య మీద నోరు పారేసుకోవడంతో సదరు వ్యక్తికి ఎక్కడలేని కోపం వచ్చింది. తనను అంటే ఓకే గానీ, తన కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చిట్టు తిట్టడంతో కోపం తట్టుకోలేకపోయాడు. సదరు మహిళ వైపు దూసుకెళ్లి ఆమె చెంపలు వాయించేశాడు. తన కోపాన్ని అంతా వెళ్లగక్కే ప్రయత్నం చేశాడు. సుమారు నాలుగైదు దెబ్బలు కొట్టాడు. ఆ మహిళ అతడి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఇంతలోగా, కోచ్ లోని తోటి ప్రయాణీకులు వచ్చి సదరు వ్యక్తిని సముదాయించే ప్రయత్నం చేశారు. కాసేపటి గొడవ సర్దుమణిగింది.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు స్పష్టంగా తెలియలేదు. అటు ఈ గొడవపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు కూడా లేవు. ఈ వైరల్ వీడియోను చూసి నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.  కొందరు మహిళ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి అక్కడి నుంచి వెలల్ఇపోయిన తర్వాత కూడా ఆమె, అతడి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడ్డం సరికాదన్నారు. మరికొందరు ఆమె మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రద్దీగా ఉండే రైల్లో చిన్న గొడవలు ఎంత పెద్ద గొడవలకు కారణం అవుతాయో ఈ ఘటన మరోసారి చూపించింది.

Read Also: ఉగాది ట్రావెలర్స్ కు బ్యాడ్ న్యూస్.. నో రైల్వే టిక్కెట్ రిజర్వేషన్స్!

Related News

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

Big Stories

Advertisement
×