E-Paper
Advertisement

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్
Advertisement

Low Budget Foreign Trip| విదేశీ ప్రయాణం అంటే భారీగా డబ్బు ఖర్చు చేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. అయితే సరైన డెస్టినేషన్ ఎంచుకుని ముందుగానే ప్లాన్ చేసుకుంటే తక్కువ బడ్జెట్‌లో కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ పలక్ దవ్దా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం.. రూ.50 వేలలోపు బడ్జెట్‌తో 4 నుంచి 5 రోజుల పాటు వెళ్లగల ఏడు దేశాలు ఉన్నాయి.

తక్కువ ఖర్చుతో అల్మాటీ టూర్

కజకిస్థాన్‌లోని అల్మాటీ నగరం ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. భారతీయులకు వీసా అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. హోటల్‌కు రాత్రికి సుమారు రూ.2,500, ఆహారానికి రోజుకు రూ.1,500 వరకు ఖర్చవుతుందని అంచనా. రౌండ్ ట్రిప్ విమాన టికెట్లకు సుమారు రూ.20,000, ఇతర ఖర్చులకు రోజుకు రూ.3,000 వరకు కేటాయించాలి.

శ్రీలంకలో బడ్జెట్ ట్రిప్ ప్లాన్

Advertisement

శ్రీలంక కూడా భారతీయ ప్రయాణికులకు వీసా రహిత గమ్యస్థానంగా పలక్ పేర్కొన్నారు. హోటల్ వసతి కోసం ఒక రాత్రికి సుమారు రూ.2,500, ఆహారానికి రోజుకు రూ.1,500 వరకు ఖర్చవుతుంది. రౌండ్ ట్రిప్ ఫ్లైట్‌కు సుమారు రూ.18,000, లోకల్ టూర్లకు రోజుకు రూ.3,000 వరకు ఖర్చు అవుతుంది.

తక్కువ బడ్జెట్‌లో మలేషియా ట్రిప్

మలేషియాలో హోటల్‌కు రాత్రికి సుమారు రూ.2,000, ఆహారానికి రోజుకు రూ.1,200 వరకు ఖర్చవుతుందని అంచనా. విమాన టికెట్లకు సుమారు రూ.18,000, ఇతర రోజువారీ ఖర్చులకు రూ.2,000 వరకు అవుతుంది.

రోడ్డు మార్గంలో భూటాన్‌ చేరుకోవచ్చు

Advertisement

ఇండియా నుంచి భూటాన్ వెళ్లేందుకు విమానం మార్గంతో రోడ్డు మార్గం కూడా ఉంది. బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి ట్యాక్సీ ద్వారా భూటాన్ సరిహద్దుకు చేరుకోవచ్చు. రోజువారీ ఫీజు సుమారు రూ.1,200, వసతికి రూ.3,000, ఆహారానికి రూ.1,200, డే టూర్లకు రూ.3,000 వరకు ఖర్చవుతుందని ఆమె తెలిపారు.

Also Read: గంధపు చెట్ల మీదే పాములు ఎందుకు ఎక్కువగా నివసిస్తాయి? సువాసన కాదు.. అసలు కారణం ఇది

ఒమన్ కూడా బడ్జెట్ ట్రావెల్‌కు ఒక ఆప్షన్

ఒమన్ ఈ-వీసాకు సుమారు రూ.1,700, హోటల్‌కు రాత్రికి రూ.3,000 వరకు ఖర్చవుతుంది. ఆహారానికి రోజుకు రూ.1,500, రౌండ్ ట్రిప్ ఫ్లైట్‌కు సుమారు రూ.15,000, టూర్లకు రోజుకు రూ.3,000 వరకు ఖర్చు కావచ్చు.

జాబితాలో కంబోడియా, థాయ్‌లాండ్ కూడా

కంబోడియాలో వీసా ఆన్ అరైవల్‌కు సుమారు రూ.2,700, వసతికి రాత్రికి రూ.2,000, ఆహారానికి రోజుకు రూ.1,200 వరకు ఖర్చవుతుంది. ఫ్లైట్‌కు సుమారు రూ.23,000, డే టూర్లకు రూ.2,500 వరకు అవసరం కావచ్చు.

థాయ్‌లాండ్‌లో హోటల్‌కు రాత్రికి రూ.2,000, ఆహారానికి రోజుకు రూ.1,200, రౌండ్ ట్రిప్ ఫ్లైట్‌కు సుమారు రూ.15,000, టూర్లకు రోజుకు రూ.2,000 వరకు ఖర్చవుతుందని అంచనా.

గమనిక: వీసా నిబంధనలు, విమాన ఛార్జీలు, హోటల్ ధరలు మారే అవకాశం ఉన్నందున బుకింగ్‌ చేసే ముందు తాజా అధికారిక వివరాలను చెక్ చేయడం మంచిది.

Also Read: డిగ్రీ లేకపోయినా రూ.1 లక్షకు పైగా జీతం.. ఎలా సంపాదిస్తున్నాడంటే

Related News

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

Big Stories

Advertisement
×