E-Paper
Advertisement

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!
Advertisement

Bigg Boss:బిగ్ బాస్ (Bigg Boss).. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో తెలుగులో ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ షోలో పార్టిసిపేట్ చేసిన చాలామంది మంచి గుర్తింపుతో పాటు భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకొని బయటకెళ్లారు. ఇకపోతే ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తికాగా.. మరి ఈ తొమ్మిది సీజన్లలో పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్స్, వారి రెమ్యూనరేషన్ లను బట్టి చూస్తే అందులో ఒక్కరికి మాత్రమే ఇప్పటివరకు అత్యధిక రెమ్యూనరేషన్ అందినట్లు తెలుస్తోంది. మరి త్వరలో బిగ్ బాస్ సీజన్ 10 కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న ఆ సెలబ్రిటీ ఎవరో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న సెలబ్రిటీ!

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఎవరో కాదు ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి(Sree Mukhi). బిగ్ బాస్ సీజన్ 3లో 13వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె.. అక్కడ తన ఆట తీరుతో, మాట తీరుతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. చివరి వరకు ఈమె విన్నర్ అవుతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆ సీజన్లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) విజేతగా నిలిచి, అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక విన్నర్ అవుతుంది అనుకున్న శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది.

విన్నర్ కంటే ఎక్కువే..

Advertisement

అయితే విజేతగా నిలిచిన రాహుల్ కంటే కూడా శ్రీముఖి ఎక్కువ పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. రాహుల్ సిప్లిగంజ్ 100 రోజులకు గానూ.. రూ.20 లక్షల రెమ్యూనరేషన్ తో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. అయితే శ్రీముఖి ఒక రెమ్యూనరేషన్ కి ఏకంగా రూ.80 లక్షల వరకూ అందుకుందట. 100 రోజులకు గానూ .. రోజుకి రూ.80 వేల వరకు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే విన్నర్ తో పోల్చుకుంటే.. శ్రీముఖి రన్నర్గా నిలిచినా రూ.10 లక్షలు అదనంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అరుదైన రికార్డు అని చెప్పాలి. ఏది ఏమైనా శ్రీముఖి తన క్రేజ్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది..

ALSO READ:పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

సెప్టెంబర్ 6న బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్..

Advertisement

ఇకపోతే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 7:00 గంటలకు చాలా గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. ఈసారి దశావతారం కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సీజన్ బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది.

బిగ్ బాస్ సీజన్ 10 లో పాల్గొనే కంటెస్టెంట్స్..

మరొకవైపు కంటెస్టెంట్ల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముకేష్ గౌడ, దేబ్ జానీ మోదక్, జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్ , పొట్టి నరేష్, నూకరాజుతోపాటు ఎక్స్ప్రెస్ హరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు యాంకర్ వర్షిని, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ లిస్ట్ తెలియాలి అంటే సెప్టెంబర్ 6 వరకు ఎదురుచూడాల్సిందే.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×