E-Paper
Advertisement

Gold Capital: గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్.. అరుదైన ఘనత దక్కించుకున్న ఆ నగరం ఏదంటే?

Gold Capital:  గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్.. అరుదైన ఘనత దక్కించుకున్న ఆ నగరం ఏదంటే?
Advertisement

Gold Capital of the World: బంగారం భూమ్మీద ఉన్న అత్యంత అరుదైన, విలువైన లోహాలలో ఒకటి. ఇప్పటి వరకు,  సుమారు 2,16,000 టన్నుల బంగారాన్ని తవ్వి తీశారు. మరో 64,000 టన్నులు బంగారు నిల్వలను పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం చైనా, ఆస్ట్రేలియా, రష్యా లాంటి దేశాలు అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. నెవాడా,  గ్రాస్‌ బర్గ్ గోల్డ్ మైన్స్ ప్రపంచంలోని అతిపెద్ద గనులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.  ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో ఇక్కడ బంగారం ఉత్పత్తి అవుతోంది. కొన్ని నగరాలు బంగారు సంపద కారణంగా బంగారు నగరాలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే, ప్రపంచ బంగారు రాజధాని అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఏదంటే?

దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరమైన జోహన్నెస్‌ బర్గ్‌ ను ప్రపంచపు బంగారు రాజధానిగా పిలుస్తున్నారు. స్థానికులు దీనిని  ‘ఎగోలి’ అని పిలుస్తారు. దీని అర్థం బంగారం ఉన్న ప్రదేశం. ఇది విట్‌ వాటర్‌ స్రాండ్ కొండలపై ఉంది. జోహన్నెస్‌ బర్గ్  1886లో జరిగిన గోల్డ్ రష్ తర్వాత అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ నగరం విట్‌ వాటర్‌ స్రాండ్ బేసిన్‌ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు తవ్విన మొత్తం బంగారంలో దాదాపు 40% ఇక్కడే వెలికి తీశారు. జోహన్నెస్‌ బర్గ్ ఇప్పటికీ మైనింగ్, ఫైనాన్స్‌ కు ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది.

జోహన్నెస్‌ బర్గ్ గురించి ఆసక్తికర విషయాల

Advertisement

⦿ 2.7 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఒక భారీ ఉల్కాపాతం లేదంటే అగ్నిపర్వత విస్ఫోటనం ఈ ప్రాంతంలోని విస్తారమైన బంగారు పొరలు ఏర్పడ్డానికి కారణం అయినట్లు శాస్త్రవేత్తలు నమ్ముతారు.

⦿ మ్పోనెంగ్ బంగారు గని భూగర్భంలో 4 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. పూర్తి లోతులో ఉష్ణోగ్రత సహజంగానే 60°C కి చేరుకుంటుంది.

Advertisement

⦿ ఈ నగరంలో కోటికి పైగా చెట్లు ఉన్నాయి. ఈ అడవి ఏకంగా ఉపగ్రహ చిత్రాలలో కూడా కనిపిస్తుంది.

⦿ ప్రపంచంలో మిగిలి ఉన్న బంగారంలో దాదాపు 50% ఇప్పటికీ ఇక్కడే ఉన్నట్లు జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతలోతుకు వెళ్లే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు.

జోహన్నెస్‌ బర్గ్‌ ను బంగారు రాజధాని అని ఎందుకు పిలుస్తారు?

జోహన్నెస్‌ బర్గ్‌ ను ప్రపంచ బంగారు రాజధాని అని పిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

చారిత్రక కారణాలు

⦿ 1886 గోల్డ్ రష్: 1886 జూలైలో జార్జ్ హారిసన్ అనే ఆస్ట్రేలియన్ అన్వేషకుడు లాంగ్లాగ్టే అనే వ్యవసాయ క్షేత్రంలో బంగారు శిలలను కనుగొన్నాడు. ఇది చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ రష్‌ల లో ఒకటిగా మారింది.

⦿ బూమ్‌ టౌన్ సక్సెస్: కేవలం పదేళ్లలోనే, చిన్న మైనింగ్ క్యాంప్ దక్షిణాఫ్రికాలోనే అతిపెద్ద మైన్ గా ఎదిగింది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి తరలివచ్చారు. దుమ్ముతో నిండిన ఆ భూభాగం ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మారింది.

⦿ భారీ ఉత్పత్తి: 1886 నుంచి మానవ చరిత్రలో ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారంలో దాదాపు 40% ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి అయింది. 1970లలో దక్షిణాఫ్రికా ఒకే సంవత్సరంలో 1,000 టన్నులకు పైగా బంగారాన్ని ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసింది.

భౌగోళిక కారణాలు

⦿ విట్‌ వాటర్‌ స్రాండ్ బేసిన్: ఇది సుమారు 2.7 నుంచి 2.9 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక పురాతన అవక్షేప బేసిన్. ఇందులో బంగారం ఉన్న కాంగ్లోమరేట్ శిలలు ఉన్నాయి.

⦿ ప్రాచీన నదీ వ్యవస్థలు: భూగర్భ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, బిలియన్ల సంవత్సరాల క్రితం, చుట్టుపక్కల ఉన్న పర్వతాల నుండి బంగారం క్రమక్షయం చెంది, ప్రాచీన నదుల ద్వారా అంతర్గత సరస్సులోకి కొట్టుకువచ్చింది. బంగారం బరువుగా ఉండటం వల్ల, అది గులకరాళ్లతో నిండిన నదీగర్భాలలో పేరుకుపోయి, తరువాత గట్టి శిలగా మారింది.

⦿ అత్యంత లోతైన ప్రాంతం: బంగారు నిక్షేపాలు భూమిలోకి చాలా లోతుగా ఉంటాయి.  జోహన్నెస్‌ బర్గ్ ప్రపంచంలోనే అత్యంత లోతైన గనులకు పేరుపొందింది.  మ్పోనెంగ్ లాంటి గనులలో కార్మికులు భూమికి 4 కిలోమీటర్ల లోతులో పని చేస్తారు.

Read Also: భూమి లోపల రహస్య సముద్రం? సంచలనం కలిగిస్తున్న కొత్త అధ్యయనం!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×