Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) అతిత్వరలోనే ప్రారంభం కానుంది. మరో 8 రోజుల్లో అంటే మార్చి 28వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు ప్రారంభ మ్యాచ్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ( RCB Vs SRH) తలపడతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మార్చి 28వ తేదీన జరగబోయేది బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ కాదని, టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ (India vs Pakistan match ) అంటూ వ్యాఖ్యానించారు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ). ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇవి చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.
ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred League Auction ) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) ఇటీవల కావ్య పాప కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2.34 కోట్లు పెట్టి మరి పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది కావ్య. అయితే, ఈ ఎపిసోడ్ నేపథ్యంలో కావ్య పాప పై ( Kavya Maran ) దేశద్రోహి ముద్ర వేస్తున్నారు జనాలు. ఇండియాలో సంపాదించిన డబ్బులను పాకిస్తాన్ వెధవల కోసం ఖర్చుపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ( SRH Team) పాకిస్తాన్ తో పోల్చుతున్నారు.
ఈ క్రమంలో ఐపీఎల్ 2026 ( Indian Premier League 2026 Tournament ) హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు ప్రారంభ మ్యాచ్ ను ఉద్దేశించి టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కాదని.. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లాగా ట్రీట్ చేయాలని బాంబు పేల్చారు. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అభిమానులు ఎవరు లేరని… మార్చి 28వ తేదీన ఈ విషయాన్ని మనం స్టేడియం లో చూస్తామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంటుందని వీరేంద్ర సెహ్వాగ్ బాంబు పేల్చారు.