E-Paper
Advertisement

Coconuts In Flights: విమానాల్లోకి కొబ్బరి కాయలను అనుమతించరు.. ఎందుకంటే?

Coconuts In Flights: విమానాల్లోకి కొబ్బరి కాయలను అనుమతించరు.. ఎందుకంటే?
Advertisement

Air Travel: శబరిమలకు వెళ్లే భక్తుల విషయంలో పౌరవిమానశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొబ్బరికాయతో సహా ఇరుముడిని హ్యాండ్ లగేజీగా తీసుకెళ్లే అవకాశం కల్పిస్తోంది. వచ్చే నెల 20 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. నిజానికి విమానాల్లో తీసుకెళ్లకూడని వస్తువుల లిస్టులో కొబ్బరికాయ కూడా ఉంది. ఇంతకీ కొబ్బరికాయను విమానంలో ఎందుకు తీసుకెళ్లనివ్వరంటే?

కొబ్బరికాయ చాలా ప్రమాదకరం

కొబ్బరి కాయలు గట్టి టెంకెను కలిగి ఉంటాయి. ఈ టెంకె ఆయుధంగా పని చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే విమాన ప్రయాణీకులను గాయపరిచేందుకు ఉపయోగించవచ్చు. విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్కరు సురక్షితంగా జర్నీ చేసేలా విమానయాన సంస్థలు చర్యలు తీసుకుంటాయి. ఆయుధాలుగా ఉపయోగపడే వస్తువులు సాధారణంగా విమానాలలో క్యారీ చేయనివ్వరు. అందులో భాగంగానే కొబ్బరికాయలను నిషేధించారు.

కొబ్బరికాయను స్కాన్ చేయడం కష్టం

Advertisement

కొబ్బరికాయ గట్టి పెంకును కలిగి ఉండటం వల్ల దాని లోపల ఏవైనా నిషేధిత వస్తువులను తీసుకెళ్తే గుర్తించడం కష్టం అవుతుంది. కనీసం స్కానర్లు కూడా కొబ్బరికాయ లోపల ఏం ఉంది? అనే విషయాన్ని గుర్తించే అవకాశం ఉండదు. అందుకే కొబ్బరికాయలను విమానాల్లో తీసుకెళ్లనివ్వరు.

ప్రయాణ సమయంలో కొబ్బరికాయ పగిలే అవకాశం!

కొబ్బరికాయలు గట్టి కొబ్బరితో పాటు లోపల నీటిని కలిగి ఉంటుంది. విమానంలో తీసుకెళ్లడం వల్ల ఎక్కువ ఎత్తుకు ఎగిరాక, కాయలో పీడనం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పగిలిపోతుంది. భద్రతా పరమైన సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కొబ్బరికాయలను తీసుకెళ్లనివ్వరు.

ఎండు కొబ్బరికి మండే స్వభావం

Advertisement

సాధారణంగా విమానంలో మండే స్వభావం ఉన్న వస్తువులను తీసుకెళ్లనివ్వరు. ఎండు కొబ్బరిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. మండే స్వభావం అధికంగా ఉంటుంది. ఒకవేళ కొబ్బరిని విమానంలో తీసుకెళ్తే ఏదైనా పొరపాటు మంట అంటుకుంటే త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎండు కొబ్బరిని విమానంలో తీసుకెళ్లనివ్వరు. ఎండిన కొబ్బరికాయల నుండి అధిక తేమ బయటకు వస్తుంది. విమానంలో తేమ పెరిగి వెంటిలేషన్ కు ఇబ్బంది కలుగుతుంది. విమానంలోని వాతావరణం కూడా అధిక తేమతో నిడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, కొబ్బరిని విమానంలోకి అనుమతించరు.

కొన్ని విమానాల్లో చెక్ ఇన్ లగేజీలో అనమతి!

విమానయాన నిబంధనల ప్రకారం సాధారణంగా ఎండిన కొబ్బరికాయలను అనుమతించరు. కొన్ని విమానాలు చెక్ ఇన్ లగేజీలోఅనుమతిస్తాయి. అయితే, విమాన ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలంటే, ముందుగా ఆయా విమాన సంస్థల నిషేధిత వస్తువుల లిస్టును పరిశీలించడం మంచిది. అంతేకాదు,  విమానయాన సంస్థల అధికారిక వెబ్ సైట్, కేంద్ర విమానయాన శాఖ అధికారులను సంప్రదించి విమానంలో నిషేదిత వస్తువులేవో తెలుసుకోవచ్చు. విమాన ప్రయాణానికి ముందు ఈ విషయాలను తెలుసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం ఉంటుంది.

Read Also: అయ్యప్ప భక్తులకు ప్రత్యేక వెసులుబాటు, విమానయాన శాఖ కీలక నిర్ణయం!

Related News

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

Big Stories

Advertisement
×