E-Paper
Advertisement

Hollywood OTT Releases : ఈ వారం ఓటీటీని షేక్ చేయనున్న హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లు.. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ నుంచి బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 2 వరకు

Hollywood OTT Releases : ఈ వారం ఓటీటీని షేక్ చేయనున్న హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లు.. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ నుంచి  బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 2 వరకు

Hollywood OTT Releases : ఈ వారం ఓటీటీలో హాలీవుడ్ సందడి మామూలుగా లేదు. థ్రిల్లర్ల నుంచి పీరియడ్ డ్రామాల వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన, అలాగే భారీ అంచనాలు ఉన్న సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారాన్ని ఫుల్ ఎంటర్టైనింగ్‌గా మార్చడానికి సిద్ధంగా ఉన్న ఆ టాప్ 5 అప్‌డేట్స్ ఇవే

1. ద బ్లఫ్ (The Bluff)

ప్రియాంక చోప్రా నటించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా మీద అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ఈ సినిమా కరీబియన్ దీవుల నేపథ్యంలో సాగే కథ. ఇందులో ప్రియాంక ఒక సముద్రపు దొంగ పాత్రలో కనిపిస్తుంది. ప్రియాంక యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అని తెలుస్తోంది.

2. బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 2 (Bridgerton Season 4 Part 2)

ప్రపంచవ్యాప్తంగా రొమాంటిక్ డ్రామా ప్రియులకు ‘బ్రిడ్జర్టన్’ ఒక అడిక్షన్. నెట్‌ఫ్లిక్స్లో ఫిబ్రవరి 26న ఈ సీజన్ పార్ట్ 2 విడుదలవుతోంది. పార్ట్ 1 ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచే అసలు సిసలు డ్రామా మొదలవుతుంది. ఈ సీజన్ ముఖ్యంగా బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్ ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. సోఫీ బేక్‌తో అతని పరిచయం, ఆ తర్వాత వచ్చే మలుపులు విజువల్స్ పరంగా చాలా గ్రాండ్‌గా ఉండబోతున్నాయి. లండన్ రాజవంశీకుల జీవనశైలి, వాళ్ళ మధ్య సాగే ప్రేమాయణాలు మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నాయి.

3. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (One Battle After Another)

ఈ వారం బిగ్గెస్ట్ అట్రాక్షన్ అంటే ఈ సినిమానే అని చెప్పాలి. లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జియో హాట్‌స్టార్లో ఫిబ్రవరి 26న వస్తోంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఆరు బాఫ్టా (BAFTA) అవార్డులు గెలుచుకున్న ఒక కళాఖండం. అంతేకాకుండా 13 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు సాధించి చరిత్ర సృష్టించింది. డికాప్రియో కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు.

4. బ్లాక్ ఫోన్ 2 (Black Phone 2)

హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ‘బ్లాక్ ఫోన్ 2’ పర్ఫెక్ట్ ఛాయిస్. 2021లో వచ్చిన ‘బ్లాక్ ఫోన్’ మొదటి పార్ట్ ఒక రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దాని సీక్వెల్ జియో హాట్‌స్టార్లో ఫిబ్రవరి 28న స్ట్రీమింగ్‌కు వస్తోంది. మాస్క్ వేసుకుని పిల్లలను కిడ్నాప్ చేసే ‘ద గ్రాబ్బర్’గా ఈథన్ హాక్ మళ్లీ భయపెట్టనున్నాడు. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, సస్పెన్స్ థ్రిల్లర్ థీమ్స్ తో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులను ఈ సినిమా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టడం గ్యారెంటీ.

5. బుగోనియా (Bugonia)

ఎమ్మా స్టోన్, జెస్సీ ప్లెమన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ ఫిబ్రవరి 28 Jio Hotstar లో స్ట్రీమింగ్ కానుంది. 2003లో వచ్చిన కొరియన్ చిత్రం ‘సేవ్ ద గ్రీన్ ప్లానెట్’ కు ఇది రీమేక్. ఇద్దరు వ్యక్తులు తమ కంపెనీ సీఈఓ (ఎమ్మా స్టోన్) ఒక ఏలియన్ అని, ఆమె భూమిని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తోందని బలంగా నమ్ముతారు. ఆ నమ్మకంతో ఆమెను కిడ్నాప్ చేసి, తమ బేస్మెంట్‌లో బంధిస్తారు. అక్కడి నుంచి జరిగే వింత సంఘటనలు, మైండ్ గేమ్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.

Read Also : కారులో శవాన్ని తీసుకొచ్చే కూతురు.. దాన్ని మాయం చేసే అమ్మ, మైండ్ బ్లాక్ చేసే మూవీ ఇది

Related News

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

ఓటీటీలోకి 7,000 కోట్ల మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ నుండి ‘ఆఫీస్ రొమాన్స్’ వరకు… ఓటీటీలోకి 6 హాలీవుడ్ మూవీస్

Big Stories

×