Bigg Boss 10 Telugu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 10 వచ్చేసింది. గత సీజన్ తో పోలిస్తే ఈసారి సీజన్ కాస్త ఆసక్తికరంగా మారింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బుల్లితెర రియాల్టీ షో గా బిగ్ బాస్ కి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఈ షో సక్సెస్ఫుల్గా ప్రసారమవుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది. సెప్టెంబర్ 6 నుంచి అన్ని భాషలలో బిగ్ బాస్ మొదలైన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి హౌస్ లోకి ఎంట్రీ చిన్న కంటెస్టెంట్ ల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి.. అయితే బిగ్ బాస్ సీజన్ 10 లోకి టాలీవుడ్ విలన్ ఎంట్రీ ఇచ్చారు. అతని గురించి ఒక ఎమోషనల్ స్టోరీ బయటకు వచ్చింది. ఆ స్టోరీ విన్న జనాలు కంటతడి పెట్టుకుంటున్నారు అన్న విషయం సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. మరి ఆ విలన్ బ్యాక్ గ్రౌండ్ గురించి మనము ఒకసారి తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో ప్రకాష్ రాజు తమ్ముడు గా విలన్ పాత్రలో కనిపించిన వంశీ ఆ సినిమాతో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎంతో భయంకరంగా కనిపిస్తూ అందరిని భయపెట్టిన ఈ విలన్ జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఎమోషనల్ స్టోరీ కూడా ఉందన్న విషయం తాజాగా వెలుగు చూసింది. ఓ ఏవీ ద్వారా తన గురించి చెప్పుకొచ్చాడు. అమీర్ పేటలో కోచింగ్ అని చెప్పి ఫోటోలు దిగి కృష్ణ నగర్ లో, ఫిలిం నగర్ లో ఆఫీసుల చుట్టూ తిరిగా అని చెప్పారు. ఎన్నో సార్లు స్టూడియోల వెంట తిరిగి తిరిగి చివరికి ఒక సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నాను. తన మొదటి పారితోషికం 600 అని ఆ ఏవి లో చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో నేటిజెన్లు అతను కచ్చితంగా గెలుస్తాడు అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీ తన మాటతీరుతో ఆట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటారో చూడాలి..
తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన వంశీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో విలన్ గా తన నటనతో అందరిని కట్టిపడేసాడు.. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాల విషయానికి వస్తే.. ‘అత్తారింటికి దారేది’, ‘భరత్ అనే నేను’, ‘సాహో’, ‘భీష్మ’, ‘వకీల్ సాబ్’, ‘హిట్ 2’, ‘దేవర’.. ఇలా పలు హిట్ ల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ లో కూడా వంశీ నటించారు.. విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వంశీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఏ మాత్రం ఆడియన్స్ ని మెప్పిస్తాడో చూడాలి.. ఇకపోతే బిగ్ బాస్ లో ఈసారి కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి ఈ కంటెస్టెంట్ లో మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తుందో బిగ్ బాస్ చూడాలి..