E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  నాగార్జున సాగర్‌ బస్సులో వెళ్తున్న  మిస్సమ్మ భయపడుతుంది. నిన్న పార్థు మీద రౌడీలతో అటాక్ చేయించింది మనోహరి. మళ్లీ ఇవాళ ఈ బస్సు మీద అటాక్‌ చేయించడానికి ఏదైనా ప్లాన్‌ చేసిందేమో అని రాథోడ్‌కు చెబితే రాథోడ్‌ నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ అసలు మనోహరి ఎక్కడుంది ఇంట్లో.. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. అమరేంద్ర సార్‌, పార్థు సార్‌. ఇద్దరు అక్కడ ఉండగానే.. అక్కడే ఉన్న మనోహరి ఎలా ప్లాన్‌ చేస్తుంది. అంతా నీ భయం తప్పా… ఏమీ లేదు.. ముందు నీ భయం వదిలేయ్‌ పిల్లలతో చిల్‌ అవ్వు మిస్సమ్మ అంటాడు రాథోడ్‌. కానీ మిస్సమ్మ మాత్రం డల్లుగా ఆలోచిస్తూనే ఉంటుంది.

మనోహరి కూడా తాను భాగీ చావు లైవ్‌లో చూడాలని అందుకోసం తాను నాగార్జున సాగర్‌ వెళ్లాలని యాదమ్మతో చెప్తుంది. అందుకు యాదమ్మ వద్దు మనోహరి ఈ విషయం అమర్‌ సార్‌కు తెలిస్తే నీకు సమస్యలొస్తాయి.. అంటే అమర్‌కు ఎవరు చెప్తారు చెప్తే నువ్వు చెప్పాలి లేదంటే నేను చెప్పాలి. మనిద్దరిలో ఎవరో ఒకరు చెబితేనే కదా తెలిసేది అంటూ కోపంగా చూస్తుంది మనోహరి. యాదమ్మ భయంతో అయ్యో మనోహరి నేనెందుకు చెప్తాను.. కానీ అమరేంద్ర సార్‌ వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడిగితే నేనేం చెప్పాలి అని అడగ్గానే.. ఏదో షాపింగ్‌కు వెళ్లిందని చెప్పు అంటూ మనోహరి బయటకు వెళ్లి కారు ఎక్కబోతుంది.

Advertisement

అప్పుడే బయటి నుంచి అమర్‌ వస్తాడు. మనోహరిని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. శారీస్‌ కొందామని వెళ్తున్నాను అని మనోహరి చెప్పగానే.. అయితే ఒక్కదానివే వెళ్లడం ఏంటి..? పార్థును తీసుకెళ్లొచ్చు కదా అంటాడు అమర్‌. పార్థు ఇంట్లో లేడని మనోహరి చెప్తుండగానే.. అప్పుడే పార్థు వస్తాడు. పార్థును చూసి మనోహరి షాక్‌ అవుతుంది. దూరం నుంచి అంతా గమనిస్తున్న యాదమ్మ కూడా మనసులో నువ్వు ఈరోజు ఇలా బుక్‌ అవుతావని అసలు ఊహించి ఉండవు మనోహరి అనుకుంటుంది.

పార్థు దగ్గరకు రాగానే.. ఎక్కడికి వెళ్లావు పార్థు.. ముందు మనోహరితో షాపింగ్‌కు వెళ్లు అని చెప్తాడు అమర్‌. పార్థు ఒక్క  ఐదు నిమిషాలు మనోహరి వెళ్దాం అంటూ అమర్‌ నిన్న మా మీద అటాక్‌ చేసిన రౌడీల గురించి ఎంక్వైరీ చేయడానికి ఐజీ ఆఫీసుకు వెళ్లాను. అంటూ పార్థు చెప్పగానే.. మనోహరి, యాదమ్మ షాక్‌ అవుతారు. వాళ్ల గురించి ఎంక్వైరీ చేస్తే భయంకరమైన నిజాలు తెలిశాయి. ఆ ముగ్గురు సుపారీ తీసుకుని హత్యలు, దోపిడీలు చేస్తుంటారట. వారి మీద చాలా కేసులు ఉన్నాయి. అంటూ తన చేతిలో ఫైల్‌ అమర్‌కు ఇస్తాడు. అమర్‌ ఫైల్‌ చూస్తుంటే మనోహరి భయపడుతుంది.

Advertisement

అమర్‌ ఫైల్‌ మొత్తం చూసి సో మిమ్మల్ని చంపడానికి ఎవరో సుపారి ఇచ్చారంటావు అని అడగ్గానే.. పార్థు అవును అమర్‌ అంటాడు. పార్థు ఇంతకుముందు నువ్వు వాళ్లను ఎప్పుడైనా అరెస్ట్‌ చేశావా అని అడిగితే లేదు అమర్‌ కానీ సుపారీ ఇచ్చి నన్ను చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటూ పార్థు అనుమానపడతాడు. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారు అని అమర్‌ అడిగితే అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు అమర్‌.. రెండు సెర్చ్‌ టీంలను పంపించి వాళ్లను వెతకమని చెప్పాను అంటూ పార్థు చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. వాళ్లు దొరికితే సుపారీ ఇచ్చిన వాళ్లు ఎవరో తెలుస్తుంది అంటూ అమర్‌ చెబితే మనోహరి డబుల్‌ షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×