E-Paper
Advertisement

Kissik Talks: ఆమే జీవితం అనుకున్నా.. చివరికి మిగిలింది కన్నీళ్లే.. లవ్ బ్రేకప్ పై అర్జున్ కళ్యాణ్ కామెంట్!

Kissik Talks: ఆమే జీవితం అనుకున్నా.. చివరికి మిగిలింది కన్నీళ్లే.. లవ్ బ్రేకప్ పై అర్జున్ కళ్యాణ్ కామెంట్!
Advertisement

Kissik Talks:సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న లవర్ బాయ్ అర్జున్ కళ్యాణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్న మనసు అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అర్జున్.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించడమే కాకుండా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు.. రాజమండ్రి కొవ్వూరుకు చెందిన అర్జున్ కళ్యాణ్ యూఎస్ఏ లో చదువు పూర్తి చేసి మోడల్గా తన కెరీర్ ను మొదలు పెట్టారు. ఒకవైపు సినిమాలు, సిరీస్ లోనే కాదు మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలలో కూడా సందడి చేసిన అర్జున్ .. బీబీ జోడిలో డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు . ప్రస్తుతం సీరియల్ లో కొనసాగిస్తున్న ఈయన తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన తాజా ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో తన ప్రేమ, బ్రేకప్ గురించి అభిమానులతో పంచుకున్నారు..

బ్రేకప్ వల్ల ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి..

యాంకర్ వర్ష.. మీరు ఇప్పటివరకు ఎంతమందికి ప్రపోజ్ చేశారు అంటూ ప్రశ్నించగా? అందుకు అర్జున్ తాను ఊరికే ఐ లవ్ యు అనే పదం వాడనని, ఆ అమ్మాయిని వివాహం చేసుకుందామనుకుంటేనే ఆ పదం ఉపయోగిస్తానని.. లేకపోతే ఉపయోగించనని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎవరికైనా చెప్పారా అంటూ వర్షా ప్రశ్నించగా? అర్జున్ కూడా చెప్పాను, ఆమె ఒప్పుకుంటే పెళ్లి లేకపోతే లేదు అంటూ చెప్పేశారు అర్జున్. అయితే ఆ వెంటనే అర్జున్.. “ఇప్పుడు లేదు ఆ ప్రేమ చచ్చిపోయిందంటూ” సడన్ షాక్ ఇచ్చారు.. ఆమె జీవితం అనుకున్నాను చివరికి కన్నీళ్లే మిగిలాయి అంటూ తెలిపారు..ఇక ఎప్పుడైనా ఏడ్చిన రోజులు ఉన్నాయా అని అడగగా.. అర్జున్ ఈరోజు ఉదయమే ఏడ్చేశానంటూ చెప్పారు. పెయిన్ అనేది మన శరీరంలో ఒక భాగం లాంటిది. ఇది ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటుందంటూ తెలిపారు అర్జున్.

Advertisement

ALSO READ:Kissik Talks: ఇండస్ట్రీలో రికమండేషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది.. అర్జున్ కళ్యాణ్ సంచలన నిజాలు!

బ్రేకప్ వల్లే డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను – అర్జున్ కళ్యాణ్

ఇదిలా ఉండగా మరొకవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టకముందే తన బ్రేకప్ స్టోరీని షేర్ చేసుకున్నారు అర్జున్ కళ్యాణ్. బ్రేకప్ టైంలో రెండేళ్లు పూర్తిగా నేను డిప్రెషన్ లో ఉండిపోయాను. సరిగ్గా అది కరోనా టైం కావడం ..ఒకవైపు కరోనాతో తల్లిదండ్రులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉండడం.. మరొకవైపు బ్రేకప్ అన్నీ కూడా నన్ను మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లేలా చేశాయి. అయితే ఎంత డిప్రెషన్ లో ఉన్నా సరే మన అనుకున్న మన వాళ్ల కోసం మనం బయటపడాలి. మన తల్లిదండ్రులే మనకు ముఖ్యం.. ఇక అలా బ్రేకప్ టైం లో నేను బాధపడినా త్వరగానే దాని నుంచి బయటపడ్డాను అంటూ తెలిపారు. ఇకపోతే బిగ్ బాస్ లో క్లోజ్ అయిన వాసంతి , శ్రీ సత్యతో తనకు మంచి స్నేహం ఉందని కెరియర్లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నానని అర్జున్ కళ్యాణ్ తెలిపారు. ఏది ఏమైనా అర్జున్ లవర్ బాయ్ లో గా కనిపించినా తన జీవితంలో ఇంత విషాదం ఉందా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×