E-Paper
Advertisement

తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!

తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!
Advertisement

MLC Approval: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం శనివారం చోటుచేసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదించారు. వీరి అభ్యర్థిత్వాలకు సంబంధించిన ఫైల్స్ పై ఆయన సంతకం చేశారు. దీంతో త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ సైతం వెలువడనున్నట్లు తెలుస్తోంది. అయితే గత మూడేళ్లుగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై వివాదం సాగుతున్న వేళ.. తాజా పరిమాణం కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగిస్తోంది.

టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రస్తుతం రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ పదవిలో కొనసాగాలంటే ఈ నెల 30వ తేదీ లోగా శాసనసభ లేదా శాసనమండలిలో కచ్చితంగా సభ్యుడి కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును సైతం కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంత్రి పదవిలో కొనసాగడానికి అజారుద్దీన్ కు లైన్ క్లియర్ అయినట్లైంది.

Advertisement

అయితే తెలంగాణలో ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియాకంపై ఎంతో కాలంగా వివాదం సాగుతోంది. గత బీఆర్ఎస్ పాలనలోనే ఈ వివాదానికి బీజం ఏర్పడింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేశారు. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఆ పేర్లను తిరస్కరించారు. వారు రాజకీయ నేపథ్యం ఉన్నవారని.. సేవ, సాంస్కృతిక రంగాలకు చెందినవారు కాదని పేర్కొన్నారు. దీనిపై అఫ్పట్లో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పాత సిఫార్సులను పక్కనపెట్టి ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను అప్పటి గవర్నర్ (జిష్ణు దేవ్ వర్మ)కు సిఫార్సు చేసింది. గవ్నర్నర్ ఆమోదంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే దీనిని సవాలు చేస్తూ దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పేర్లను తిరస్కరించడం చెల్లదని, అది గవర్నర్ పరిధిలోకి రాదని వాదించారు.

Advertisement

Also Read: Congress vs BRS: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ.. మళ్లీ ENOకి పనిబడిందా? బీఆర్ఎస్‌పై సెటైర్లు!

దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై స్టే విధించింది. కోర్టు ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకుని ప్రమాణ స్వీకారం చేయించారని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఇటీవల అమీర్ అలీ ఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు గవర్నర్ కు సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి కోదండరాం, అజారుద్దీన్ నియామక ఫైళ్లను త్వరగా ఆమోదించాలని కోరారు. దీంతో గవర్నర్ తాజాగా ప్రభుత్వ సిఫార్సును ఆమోదిస్తూ సంతకం చేయడం గమనార్హం.

Also Read: Kavitha New Party: బీఆర్ఎస్ కోసం రక్తం చిందించా.. కేసీఆర్ మనిషి కాదు, మర మనిషి.. విరుచుకుపడ్డ కవిత!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×