E-Paper
Advertisement

ఇది దేవుడిచ్చిన బంధం.. ఆ కమెడియన్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ!

ఇది దేవుడిచ్చిన బంధం.. ఆ కమెడియన్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ!
Advertisement

Indraja: ఇంద్రజ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే ఇంద్రజ మరోవైపు జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా జడ్జిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె జబర్దస్త్ కమెడియన్, నటుడు, యాంకర్ సుధీర్ గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

సుధీర్ నాకు దేవుడిచ్చిన కొడుకు..

సుడిగాలి సుధీర్ గురించి ఇంద్రజ మాట్లాడుతూ సుదీర్ తో తన బంధం దేవుడిచ్చిన బంధం అని తెలిపారు.. సిద్దు నా కొడుకు లాంటివాడు నన్ను చాలా ప్రేమగా ఆప్యాయంగా అమ్మ అని పిలుస్తాడు. అలా పిలవడమే కాకుండా తనని అమ్మలాగే చూసుకుంటాడని, ఒక తల్లికి తన కొడుకు నుంచి వచ్చే ప్రేమ గౌరవం సుదీర్ నుంచి నాకు దక్కుతుందని ఇంద్రజ తెలిపారు. ఇలా తన పట్ల సుధీర్ చూపిస్తున్న ప్రేమ గౌరవం చూస్తున్నప్పుడల్లా ఇది దేవుడిచ్చిన బంధం అనిపిస్తుందని ఈమె తెలియజేశారు. ఇక సుధీర్ ను చాలా ప్రేమగా సిద్దు అని పిలుస్తాను తను కూడా నన్ను రాజి అంటూ ప్రేమగా పిలుస్తారని తెలియజేశారు.

ప్రేమగా రాజీ అని పిలుస్తాడు..

Advertisement

ఇంద్రజ అసలు పేరు రజాతి కావడంతో తన ఇంట్లో తనని అందరూ రాజీ అని పిలుస్తారు. అలాగే సుధీర్ కూడా నన్ను రాజీ అని పిలుస్తాడు అంటూ ఈమె సుధీర్ గురించి తెలియజేశారు. ఇక తాను ఎక్కడికైనా బయటకు వెళ్తే సుదీర్ తో కలిసి ఎందుకు షో చేయటం లేదు అంటూ చాలామంది నన్ను అడుగుతుంటారని ఈమె తెలిపారు. సుధీర్ ప్రస్తుతం యాంకర్ గా అలాగే హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హీరోగా సుధీర్ ఇంకా అనుకున్న స్థాయిలో లేరని తాను ఇంకా మంచి స్థానంలో ఉండాలని ఇంద్రజ తెలిపారు. ఇలా సుధీర్ గురించి ఇంద్రజ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

స్టాండప్ కమెడియన్ గా కెరియర్ ప్రారంభం..

Advertisement

సుడిగాలి సుదీర్ స్టాండప్ కమెడియన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఇలా స్టాండప్ కమెడియన్ గా కొనసాగుతున్న ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తనలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సమయంలో సుధీర్ యాంకర్ గా కొనసాగారు. కొన్ని కారణాల వల్ల సుధీర్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఈయన మాత్రం హీరోగా కొనసాగుతూనే మరోవైపు జీ తెలుగులో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Also Read: జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు… జడ్జిగా దూరమైన ఆ పని మానలేదన్న మెగా బ్రదర్!

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×