E-Paper
Advertisement

Big TV Kissik Talks: మనీనా, మనుషులా అంటే.. లయ చెప్పిన సమాధానమిదే!

Big TV Kissik Talks: మనీనా, మనుషులా అంటే.. లయ చెప్పిన సమాధానమిదే!
Advertisement

Big TV Kissik Talks: ప్రస్తుత జనరేషన్‌లో మనీనా? మనుషులా? (Money or Human) అంటే అంతా మనీనే ఇంపార్టెంట్ అని అంటారు. మనీ ఉంటే చుట్టూ మనుషులు ఉంటారనే ఆన్సరే వస్తుంది. ఇదే ప్రశ్న నటి లయ (Actress Laya)ను అడిగితే ఏం సమాధానం చెప్పారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) షో‌లో పాల్గొన్న లయ.. మనీ, మనుషుల గురించే కాకుండా, తన పిల్లలను ఇండస్ట్రీకి తీసుకొచ్చే ఉద్దేశ్యం గురించి, ఇంకా ప్రశాంతమైన జీవితం, సక్సెస్ అంటే ఏంటి? అనే వాటిపై మాట్లాడారు.

తన ఇష్టం

‘‘మా పిల్లలు ఆర్టిస్ట్‌లవుతామని అంటే నాకు ఓకే. నేను అయ్యాను కదా. రోల్స్ అంటారా? వాళ్ల ఇష్టం. నేను మాత్రం లీడ్ రోల్స్ చేయాలని కోరుకుంటాను. నాకు కూడా మెయిన్ లీడ్ చేయాలనే ఉంటుంది. కానీ అది ఢిపరెంట్ అనుకోండి. కానీ, వాళ్లు మెయిన్ లీడ్ చేయాలనే అనుకుంటున్నాను. కాకపోతే దానికి చాలా కష్టపడాలి. బాడీ మెయింటైన్ చేయాలి. బాగా రెడీ అవ్వాలి. తెలుగు నేర్చుకోవాలి. ఏమైనా అవ్వాలంటే.. ఇవన్నీ చేయాలి.. ఊరికే నటులు అయిపోతారా? ప్రస్తుతం మా పాప చదువుకుంటుంది. ఒక వేళ నిజంగా తను నటి అవ్వాలనుకుంటే, ఇవన్నీ చెబుతాను. ఇంత కష్టపడాలని చెబుతాను. నేను వద్దని చెప్పను, అలా అని ఎంకరేజ్ కూడా చేయను. తనకు ఏది ఇష్టం అయితే అది చేస్తుంది.

Advertisement

Also Read- Actress Laya: అలాంటి వారికి డివోర్సే బెటర్.. పెద్దరికం చేయమంటే నేను ఇదే చెబుతా!

సక్సెస్ అంటే..

నా లైఫ్‌లో ప్రశాంతమైన జీవితం అంటే, కంపారిజన్స్ లేకుండా, మనకి ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటూ, చేరుకోవాల్సిన గోల్‌కి ఏమేం చేయాలో చేసుకుంటూ వెళ్లడమే. అనవసరపు గొడవల జోలికి వెళ్లకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా.. హ్యాపీగా హెల్త్ చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ ఒక రకమైన జీవితం గడిపితే చాలు. నా లైఫ్‌లో సక్సెస్ అంటే.. అసలు సక్సెస్‌కు థేర్ ఈజ్ నో ఎండ్. ఈ రోజు నాకు సక్సెస్ వచ్చింది. రేపు ఇంకో సక్సెస్ కావాలి. అనుకున్నది అఛీవ్ అవుతున్నారా? లేదా? నీ చుట్టుపక్కల ఉన్నవారిని డిస్టర్బ్ చేయకుండా, అస్తమానం పనే అని కాకుండా, హెల్త్ చూసుకుంటూ.. అన్నీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్లడమే సక్సెస్.

Advertisement

Also Read- Kissik Talks: కష్టం వచ్చిన ప్రతిసారి.. నన్ను ఏదో శక్తి ప్రొటక్ట్ చేస్తుంది- లయ

మనీనా.. మనుషులా?

రెండూ ఇంపార్టెంట్. నేను లక్‌ని, టాలెంట్‌ని రెండింటిని సగం సగం నమ్ముతాను. అంటే, టాలెంట్ మస్ట్.. కానీ కొంచెం లక్ కూడా ఉండాలి. రెండూ ఉండాలి. ఏదైనా పాజిటివ్‌గా ట్రై చేయాలి. మనీనా, మనుషులా? అని, ఒక్కటే పిక్ చేసుకోమంటే ఎవరికైనా చాలా కష్టం. నా వరకు టోటల్‌గా మనుషులే అని చెప్పగలను. నా పరిస్థితి అంతా బాగుంటే ఒక సమాధానం వస్తుంది. నాకసలు తినడానికి కూడా ఏం లేదు అన్నప్పుడు ఇంకో సమాధానం వస్తుంది. పరిస్థితులను బట్టి మారుతుంది. ఇప్పుడు నేనున్న కంఫర్ట్ జోన్‌లో అయితే మనుషులే అని చెబుతాను. ఇప్పుడు మనుషులనే ఎర్న్ చేసుకోవాలి. మనం పోయినా మన గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు దేవుడు వచ్చి ఏదైనా కోరుకోమని అడిగితే మా ఫ్యామిలీ మొత్తానికి గుడ్ హెల్త్ కావాలని కోరుకుంటాను..’’ అని లయ చెప్పుకొచ్చారు.

Also Read- Kissik Talks: ‘అమ్మోరు’లో మొదట నాకే అవకాశం వచ్చింది.. ఎందుకు చేయలేదంటే? – లయ

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×