E-Paper
Advertisement

Panchayat Funds: పల్లెలకు నిధుల వెల్లువ.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

Panchayat Funds: పల్లెలకు నిధుల వెల్లువ.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
Advertisement

Panchayat Funds: జిల్లాలోని గ్రామపంచాయతీలకు నిధులు వచ్చాయి కొత్త పాలకవర్గాలు కొలువు తీరడంతో కేంద్రం నిధులు మంజూరు చేసింది. 15 ఆర్థిక సంఘం నిధులను కేటాయించింది. ఈ మేరకు జిల్లాలోని 255 గ్రామపంచాయతీల ఖాతాల్లో 14.74 కోట్ల నిధులు జమయ్యాయి. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. మూడు నెలల క్రితం పంచాయతీలకు ఎన్నికలు జరగడంతో క్రమంగా నిధులు విడుదల అవుతున్నాయి. అయితే 2024- 25 వ వార్షిక ఏడాదిలో నాలుగు సార్లు రావాల్సిన నిధులు ఇప్పటికే రెండు మార్లు గత పాలక వర్గాల హాయంలోనే జిల్లాకు వచ్చాయి. గత గ్రామ పాలకవర్గాల పదవీకాలం పూర్తవడం, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో గ్రామాలల్లో మౌలిక వసతులు కల్పన లేక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఖజానాలో డబ్బులు లేకపోవడంతో చిన్న చిన్న పనులు సైతం చేపట్టడానికి ఇటీవల ఎన్నికైన పాలకవర్గ సభ్యులు సతమతమవుతున్నారు. తాజాగా జిపి లకు డబ్బులు రావడంతో కొత్త పాలకవర్గాలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది . దీంతో గ్రామాల్లో అత్యవసర సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

Also ReadAnimal Language: మనుషులకే కాదు.. ఈ జంతువులకూ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్!

గ్రామపంచాయతీ ఖాతాలో జమ

Advertisement

కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను వీధి దీపాలు, ట్రాక్టర్ల నిర్వహణ, ఇంధన వినియోగం, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్య క్రమంలో వెచ్చించాలని అధికారులు సూచించారు. అందులోంచి ఐదు నుంచి పది శాతం డబ్బును గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేస్తున్నారు. వీటితో గ్రామ పంచాయతీ ఆపరేటర్ల వేతనాలు స్టేషనరీకి ఖర్చు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తమ సహాయంతో చేపట్టిన పనుల బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని త్వరగా మంజూరు చేయాలని తాజా మాజీ సర్పంచులు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ను కలిశారు. పాత పాలక వర్గాల సమయంలో చేసిన పనులకు ప్రాధాన్య క్రమంలో బిల్లులు ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లాలకు వాట్సప్ లో సమాచారం అందించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పంచాయతీలకు వచ్చిన చిన్న మొత్తం డబ్బులు దేనికి వచ్చిన ఎందరికి ఎంత సర్దుబాటు చేయాలి అని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.

Also Read:Vizag Metro: వైజాగ్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో వచ్చేస్తోంది, డెడ్ లైన్ ఫిక్స్ చేసిన మంత్రి! 

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×