E-Paper
Advertisement

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!
Advertisement

BMTC Bus Tracking: బెంగళూరు నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు నగర మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) కీలక అడుగులు వేస్తోంది. నగరంలో క్యాబ్, ఆటో సేవలు అందించే ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌లతో తమ బస్సుల రియల్-టైమ్ సమాచారాన్ని (లైవ్ లొకేషన్) పంచుకోవాలని బీఎంటీసీ నిర్ణయించింది. దీనివల్ల ప్రయాణికులు తమ ఫోన్లలో ఓలా, ఉబర్ యాప్స్ ఉపయోగిస్తున్న సమయంలోనే బీఎంటీసీ బస్సులు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు.

సెప్టెంబర్ చివరి నుంచి..

కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ (Byrathi Suresh) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బస్సుల లైవ్ ట్రాకింగ్ డేటాను ప్రైవేట్ రవాణా సంస్థలకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రముఖ ప్రైవేట్ ఆపరేటర్లతో చర్చలు పురోగతిలో ఉన్నాయని సెప్టెంబర్ చివరి నాటికి దీనికి సంబంధించిన సాంకేతిక ప్రక్రియను పూర్తి చేస్తామని బీఎం‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రఘునందన్ మూర్తి వెల్లడించారు.

వారంలో బీఎంటీసీ 2.0 యాప్

Advertisement

ఇదిలా ఉంటే బెంగళూరులోని అన్ని సిటీ బస్సుల సమాచారాన్ని అందిస్తూ నమ్మ బీఎంటీసీ కొత్త వెర్షన్‌ (BMTC App 2.0)ను మరో వారంలో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో పాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) సేవలను అన్ని బస్సుల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దీనివల్ల బెంగళూరు మెట్రో (BMRCL) ప్రయాణికులు తమ వద్ద ఉన్న ఎన్‌సీఎంసీ కార్డులనే బీఎంటీసీ బస్సుల్లోనూ ప్రయాణానికి ఉపయోగింవచ్చని తెలియజేసింది.

Also Read: గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

200 మినీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

Advertisement

మరోవైపు మెట్రో స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు 200 మినీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని మంత్రి ఆదేశించారు. ఇవి మెట్రో స్టేషన్ల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలోని నివాస ప్రాంతాలకు సేవలందిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఐటీ సంస్థల ఉద్యోగుల కోసం మరిన్ని ఏసీ బస్సులను కేటాయించేందుకు ఆయా కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. వీటితో పాటు సంస్థలో ఆదాయ లీకేజీలను అరికట్టి రవాణా సంస్థల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు రవాణా మంత్రి దిశానిర్దేశం చేశారు.

Also Read: నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

Tags

Related News

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Big Stories

Advertisement
×