Revanth Reddy: ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తునమన్నామని సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ ఫామ్ హౌస్‌లో కెసీఆర్ అధ్యక్షతన సభను సజావుగా జరగకుండా కుట్ర చేశారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించిమూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారని అన్నారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం చేశారని తెలిపారు.
శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టడం జరిగిందని, సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనండని సీఎం సూచించారు. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని, ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్‌లో రాజకీయంగా రాణించలేరని అన్నారు.
Also read: పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!
అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నామని, అసెంబ్లీలో సెంట్రల్ హాల్‌ను ప్రారంభించుకుని దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నామని అన్నారు. సభలో నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలి అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చాలని చూస్తున్నారని, కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీత లక్ష్మా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? పోలీస్ సిబ్బందిలో కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కనిపించినట్టున్నారని ఫైర్ అయ్యారు. అంత ఆక్రోశంతో అధికారులపై దాడులు చేశారు. దేశానికి మనం చేసిన జనగణన రోల్ మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత. తెలంగాణ నమూనాను జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, SIR పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఈ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మీ ప్రతీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుందని సీఎం స్పష్టం చేశారు. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని, SIR అంశాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకోండని అన్నారు. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లు గా తేల్చారు, కానీ ఓటర్ల జాబితా మాత్రం 88 కోట్లుగా చూపుతున్నారు. దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉంద. 1000 రోజుల పాలనకు సహకరించి నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ మీ సహకారం తో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
Also read: నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం