E-Paper
Advertisement

సనాతన ధర్మం.. ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !

సనాతన ధర్మం..  ట్రోలర్స్ కి మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్ !
Advertisement

Anasuya: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని.. అందం, అభినయంతో.. అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది అనసూయ (Anasuya). జబర్దస్త్ లో తన పెర్ఫార్మన్స్ చూసిన ఎంతో మంది దర్శకులు ఈమెకు మంచి మంచి పాత్రలు రాసుకొని మరీ సినిమాలలో అవకాశం కల్పించారు. అలా రంగమ్మత్త, ద్రాక్షాయని పాత్రలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఈమధ్య కాలంలో తరచూ వివాదాలలో చిక్కుకుంటుంది. ముఖ్యంగా అనసూయ ఎప్పుడు ఏం మాట్లాడుతుందా? ఆమెను ఎప్పుడు ఎలా ట్రోల్స్ చేద్దామా ? అని కాచుకొని మరి కూర్చునే బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. అయితే అనసూయ కూడా తాను తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు అనే ధోరణిని కొనసాగిస్తూ.. తనపై ట్రోల్స్ చేసేవారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తోంది.

వివరణ ఇచ్చినా అనసూయపై ఆగని ట్రోల్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం దేవుడి పేరు చెప్పుకొని మోసం చేసేవారు హిందువులే కాదు అంటూ కామెంట్లు చేసింది అనసూయ. దీంతో కొంతమంది ఆమె సనాతన ధర్మాన్ని అవమానించింది అంటూ కొన్ని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. కొందరైతే ఏకంగా ఆమెను వ్యక్తిగతంగా దూషిస్తూ భూతులతో రెచ్చిపోయారు . అయితే అనసూయ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ ఇప్పటికే వివరణ ఇచ్చినా.. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని అని, తనకు ధర్మం, విశ్వాసాలపై పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.

Advertisement

also read:నా జీవితంలో నేను చేసిన ఆల్ఫా పని అదే.. ఎన్నో నిజాలు బయటపెట్టిన అల్లు అర్జున్!

మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై మరోసారి కౌంటర్..

అంతేకాదు తనను వేధించే వాళ్లది ఏ మతమైనా ప్రశ్నిస్తానని.. ఎడిట్ చేసిన క్లిప్పులతో గొడవకు దిగొద్దు అంటూ కోరింది. అంతేకాదు తాను హిందువునని చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం లేదు అంటూనే జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలను సోషల్ మీడియా వేదికగా వినిపించింది కూడా.. అయినప్పటికీ ఆమెపై కొంతమంది పనిగట్టుకొని మరీ అటాక్ చేస్తూ రెచ్చిపోతున్నారు. దీంతో మరొకసారి మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్లకి గట్టి కౌంటర్ ఇచ్చింది అనసూయ.

నిజమైన హిందువులు దేవుడిని వాడుకోరు..

Advertisement

తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో మరో వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో అనసూయ..” వర్కౌట్ చేసి ఇప్పుడే కిందకి వచ్చాను. ఇది నా రొటీన్.. చాలామందికి తెలుసు. ముఖ్యంగా పిచ్చి వాగుడువాగే వాళ్ళందరికీ కూడా తెలుసు. మా ఇంట్లో ప్రతిరోజు సుప్రభాతం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా వినిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ మా ఇంట్లో ఉండే అలెక్సాకి కూడా అలవాటైపోయాయి. నాలాంటి హార్డ్ కోర్ సనాతన ధర్మాన్ని ఫాలో చేసే వాళ్ళు రియల్ హిందువులు.. దేవుడిని, దేవుడి పేరుని వాడుకోరు.. బలంగా చేసుకుంటారు.. ప్రాక్టీస్ చేస్తారు.. ఇన్స్పైర్ గా ఉంటారు.. ఇలాంటి వాటిపై డిబేట్ పెట్టరు.. వైరల్ చేయరు.. అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది అనసూయ.

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×