E-Paper
Advertisement

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!
Advertisement

Anasuya:నటిగా, యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది అనసూయ (Anasuya). జబర్దస్త్(Jabardasth) కామెడీ షోలో యాంకర్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటిగా మంచి పేరు సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో అలరించే అనసూయ.. పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అనసూయ ఏం మాట్లాడినా వివాదంగా మారే సందర్భాలు కూడా మనం ఎన్నో చూశాయి. గత కొన్ని రోజులుగా హిందూ ధర్మంపై ఈమె చేసిన కామెంట్లు.. ఈమెపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలు.. అన్నీ ఈమెను ట్రెండింగ్ లో ఉంచేస్తున్నాయి.

రాధా గెటప్ లో అనసూయ..

నిత్యం కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలిచే ఈమె.. తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధా గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. చేతులకు, పాదాలకు నీలం రంగు పులుముకొని, ఎరుపు రంగు చీర కట్టుకొని జుట్టును విరబూసుకొని మరీ తన అద్భుతమైన నృత్య కవళికలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అనసూయ షేర్ చేసిన ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాంట్రవర్సీ మాటలతో నిత్యం వార్తల్లో నిలిచే అనసూయలో.. ఈ టాలెంట్ కూడా ఉందా? అంటూ అభిమానులు ముగ్ధులు అవుతున్నారు. మొత్తానికి అయితే రాధా గెటప్ లో అనసూయ అందరి మనసులు దోచుకుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

వీడియోతో పాటు ఆకట్టుకుంటున్న క్యాప్షన్..

Advertisement

అనసూయ ఈ వీడియోని షేర్ చేస్తూ.. శాంతం, నిగ్రహం, తపస్సు, పవిత్రత , సహనం మరియు సరళత ,జ్ఞానం, సాక్షాత్కారం ,విశ్వాసం, బ్రహ్మచర్యం అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికైతే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధా గెటప్ లో తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ కనబరిచి వార్తల్లో నిలిచింది అనసూయ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చెయ్యగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

వివాదాల్లో చిక్కుకుంటున్న అనసూయ..

Advertisement

ఇకపోతే గత కొన్ని రోజులుగా అనసూయ వివాదాలలో చిక్కుకుంటుంది. ముఖ్యంగా నిజమైన హిందువులు దేవుడి పేరు వాడుకోరు అంటూ చేసిన కామెంట్లకు కొంతమంది ఈమెను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తనదైన శైలిలో ఆమె కౌంటర్ ఇస్తూనే వచ్చింది. దీనికి తోడు ఇటీవల తన తల్లి , తన తండ్రి మరణించిన తర్వాత గాజులు, కుంకుమ, పువ్వులు తీసివేయడంపై కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఈ విషయాలతో తన అభిప్రాయాలను చెప్పినప్పటికీ.. కాంట్రవర్సీ ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తోంది అనసూయ.

అనసూయ సినిమాలు..

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం , పుష్ప సినిమాలతో పాన్ ఇండియా స్థాయిని గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇటీవల యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ లో అద్భుతమైన నటన కనబరిచి ఆకట్టుకుంది.

 

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Big Stories

Advertisement
×