E-Paper
Advertisement

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!
Advertisement

Reliance Jio Cloud PC: ఎంత డబ్బు పెట్టి కొన్న లాప్‌టాప్స్, డెస్క్‌టాప్‌లు అయినా కొన్నేళ్లకు స్లో అయిపోతుంటాయి. కొత్తది కొందామంటే భారీగా ఖర్చవుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారి కోసం రిలయన్స్ జియో ఒక అదిరిపోయే పరిష్కారాన్ని తీసుకొచ్చింది. అదే JioPC. దీని ద్వారా పాత కంప్యూటర్‌ను కొత్త హార్డ్‌వేర్ ఏమీ కొనకుండానే స్పీడ్ క్లౌడ్ పీసీగా మార్చేసుకోవచ్చు. ఏ నెట్‌వర్క్ వాడుతున్న వారైనా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే..

సింపుల్‌గా క్లౌడ్ పీసీ:

కంప్యూటర్ ఎంత పాతదైనా సరే.. జియోపీసీ ద్వారా కష్టమైన పనులను కూడా క్లౌడ్ సహాయంతో సులువుగా పూర్తి చేయవచ్చు. కేవలం 5 నిమిషాల్లోనే దీని సెటప్ పూర్తవుతుంది. బ్రౌజర్ ద్వారా లాగిన్ అయి నేరుగా వాడుకోవటమే. దీనికోసం ప్రత్యేకంగా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా హార్డ్‌వేర్ విడిభాగాలను మార్చడం లాంటి శ్రమ ఏమీ ఉండదు. పాత డివైజ్‌లకు ఇది నిజంగా కొత్త ఊపిరి పోస్తుందని చెప్పవచ్చు.

Advertisement

Also Read: యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

తక్కువ ధరలో ప్లాన్స్:

JioPC రెండు రకాల ప్లాన్లను అందిస్తోంది. స్టాండర్డ్ ప్లాన్‌లో 8GB ర్యామ్, 500GB స్టోరేజ్ లభిస్తాయి. దీని ధర రెండు నెలలకు రూ.1,000 ఉంది. ఒకవేళ మీకు ఎక్కువ పనితీరు కావాలంటే అల్ట్రా ప్లాన్ ఎంచుకోవచ్చు. ఇందులో 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ లభిస్తాయి. దీని ప్రారంభ ధర రెండు నెలలకు రూ.1,200 మాత్రమే. ఏడాది ప్లాన్స్ తీసుకుంటే అదనపు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది.

టీవీ కూడా కంప్యూటరే:

Advertisement

JioPC కేవలం లాప్‌టాప్‌లకే పరిమితం కాలేదు. మీ ఇంట్లో జియో సెట్‌టాప్ బాక్స్ ఉంటే, దానికి కీబోర్డ్, మౌస్ కనెక్ట్ చేసి మీ టీవీని కూడా కంప్యూటర్‌లా మార్చేయవచ్చు. టీవీ స్క్రీన్‌పైనే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడం, ఆన్‌లైన్ క్లాసులు వినడం లాంటివి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లల చదువుకు, ఆఫీస్ పనులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కొన్ని పరిమితులు ఉన్నాయి:

ఈ సేవను వాడటానికి వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. నెట్ లేకపోతే JioPC పనిచేయదు. అలాగే ఇది Ubuntu లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కాబట్టి.. ప్రత్యేకమైన విండోస్ సాఫ్ట్‌వేర్లు వాడేవారికి ఇది అంతగా సరిపోకపోవచ్చు. అయితే రోజువారీ బ్రౌజింగ్, టైపింగ్, ఆన్‌లైన్ పనులు చేసుకునే వారికి మాత్రం జియోపీసీ ఒక మంచి ఆప్షన్. కొత్త లాప్‌టాప్ కొనే అవసరం లేకుండా డబ్బులు ఆదా చేసుకోవడానికి ఇది బెస్ట్ ఛాయిస్.

Also Read: ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

Tags

Related News

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

Big Stories

Advertisement
×