E-Paper
Advertisement

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు,  శాలరీ ఖాతాదారులైతే..
Advertisement

SBI Customers Alert: రాబడి పెంచుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నాయి బ్యాంకులు. ఉన్న ఖాతాదారులపై ఫోకస్ చేశాయి. ఇప్పటికే కెనడా బ్యాంకు మార్పులు చేయగా, ఇప్పుడు ఎస్బీఐ వంతైంది. ఎస్బీఐ ఖాతాదారులు, శాలరీ అకౌంట్‌‌దారులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే అక్టోబర్ ఒకటి నుంచి పలు మార్పులు చేస్తోంది ఎస్బీఐ. ఇంతకీ ఆ మార్పులేంటి? ఒక్కసారి చూద్దాం.

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్

కస్టమర్లకు రకాల సేవలను అందిస్తుంటాయి ప్రభుత్వ-ప్రైవేటు రంగ బ్యాంకులు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ఖాతాదారులకు సడెన్ షాక్ ఇచ్చింది. ఎస్బీఐ డెబిట్ కార్డును ఉపయోగించి ఇతర బ్యాంకు ఏటీఎంలు నుంచి చేసుకునే ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లపై పరిమితులు విధించింది. శాలరీ అకౌంటుదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఉచితంగా 10 సార్లు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది. తాజాగా ఆ పరిమితిని ఐదుకు కుదించింది. సగానికి సగం కోత పెట్టింది. ఆర్థిక, ఆర్థికేతర రెండింటికీ వర్తిస్తుందని తేల్చిచెప్పింది. తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది.

ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

Advertisement

ఉచిత లావాదేవీల పరిమితి దాటితే శాలరీ అకౌంట్ దారులకు అదనపు ఛార్జీలు విధించనుంది. నెలవారీ 5 ట్రాన్సాక్షన్లు దాటితే అదనంగా ఒక్కో ట్రాన్సాక్షన్‌పై రూ. 23 ప్లస్ జీఎస్టీ వసూలు చేయనుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు రూ. 11 ప్లస్ జీఎస్టీ ఛార్జీ పడుతుందని తేల్చిచెప్పేసింది. కొత్త రూల్స్ కేవలం శాలరీ ఖాతాదారులకు మాత్రమే. సాధారణ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి రూల్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. వీరికి నెలవారీ ఉచిత లావాదేవీలు, సర్వీస్ ఛార్జీలు గతంలో ఉన్నవే. మరోవైపు ఎస్బీఐ ఏటీఎంలలో కస్టమర్లు ప్రతి నెలా 10 వరకు ఉచిత ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.

ALSO READ: కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

Advertisement

ఇతర బ్యాంకు ఏటీఎంల్లో కేవలం ఐదు వరకు విత్‌డ్రా ట్రాన్సాక్షన్లకు అనుమతి ఉంటుంది. సాధారణ కస్టమర్లకు వర్తించనుంది. శాలరీ ఖాతాదారులు, శౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతాలు, ఎస్‌బిఐ రిష్టే ఫ్యామిలీ సేవింగ్స్ ఖాతాలతోపాటు వర్తించే ప్రయోజనాల కింద ఎస్‌బిఐ ఏటిఎమ్‌లలో అపరిమిత ఉచిత లావాదేవీలను పొందడం కొనసాగిస్తారు.

Related News

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

Big Stories

Advertisement
×