E-Paper
Advertisement

Hyderabad Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రైజింగ్ తెలంగాణ-2047 కొత్త లక్ష్యాలు

Hyderabad Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రైజింగ్ తెలంగాణ-2047 కొత్త లక్ష్యాలు
Advertisement

Hyderabad Republic Day: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైజింగ్ తెలంగాణ-2047లో భాగంగా తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణ ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

Advertisement

ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌, ఆ తర్వాత ప్రసంగించారు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందన్నారు. భిన్నత్వం లో ఏకత్వం మన ప్రత్యేకత అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 ద్వారా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.

2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యాన్ని పెట్టుకుందన్నారు.రాష్ట్ర అభివృద్ధిని మూడు రకాలుగా (CURE, PURE, RARE) విభజించి సమతుల్య పాలనను అందిస్తున్నట్లు ప్రస్తావించారు. వరి ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.

Advertisement

పరేడ్‌ గ్రౌండ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండా ఆవిష్కరణ,  రైజింగ్ తెలంగాణ-2047 కొత్త లక్ష్యాలు

అన్నదాతలకు రూ.20,617 కోట్లతో సుమారు 26 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణ విముక్తి కల్పించిందన్నారు. సన్నధాన్యం పండించే రైతులకు బోనస్ అందించడం, ధరణి సమస్యలను పరిష్కాం కోసం భూభారతి చట్టాన్ని తీసుకురావడం వంటివి విప్లవాత్మక మార్పులని పేర్కొన్నారు. చరిత్రలో తొలిసారి మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించని పేర్కొన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా రూ.40 వేల కోట్ల బ్యాంకు అనుసంధానం చేశామన్నారు.ఈ విధంగా చేయడం ఇదొక గొప్ప విషయమని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని వివరించారు.

ALSO READ: హుస్నాబాద్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి బాటలు.. సీసీ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్న తీరును ప్రశంసించారు. అలాగే ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, మెట్రో రెండో దశ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయని ధీమా వ్యక్తం చేశారు గవర్నర్. తెలంగాణ పోలీస్ దేశంలో తొలి స్థానంలో నిలవడం రాష్ట్ర ప్రతిష్టను పెంచిందన్నారు.

 

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×