Anchor Gayatri Bhargavi: విమానయాన ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. సుధూర ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అతి తక్కువ సమయంలోనే చేరవేస్తూ జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుస్తూ.. ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోంది. అలాంటి ఈ విమానయాన ప్రయాణం ఒక్కొక్కసారి భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి అనుకున్న సమయానికి విమానం బయలుదేరకపోతే వచ్చే ఫ్రస్టేషన్ కూడా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఎయిర్ లైన్స్ నడిపే సిబ్బంది.. ఫ్లైట్ డిలే అయితే అందుకు సమాధానం కష్టమర్లకు చెప్పుకోవాల్సి ఉంటుంది. కచ్చితంగా వారికి కావాల్సిన ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది.
కానీ ఒక్కొక్కసారి ఎయిర్ లైన్స్ సిబ్బంది కస్టమర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటే ఎవరికైనా సరే పట్టరాని కోపం వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు సదరు ఎయిర్లైన్స్ పై తమ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అలయన్స్ ఎయిర్ లైన్స్ పై ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి (Gayatri Bhargavi) అసహనం వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ప్రముఖ యాంకర్ గాయత్రీ భార్గవి తాజాగా బెంగళూరులోని అలయన్స్ ఎయిర్ లైన్స్ ఎయిర్పోర్టులో బెంగళూరు నుండి హైదరాబాదుకి వెళ్లాల్సి ఉండగా.. ఫ్లైట్ డిలే అవడం, అక్కడ సిబ్బంది వీరితో ప్రవర్తించిన తీరుకు అసహనం వ్యక్తం చేసిన ఈమె ఒక వీడియో విడుదల చేసింది. అందులో గాయత్రి భార్గవి మాట్లాడుతూ..” అందరికీ నమస్కారం నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నాను.8:45 కి బెంగళూరు నుంచి హైదరాబాదుకి అలయన్స్ ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరాలి. కానీ డిలే అయిపోయింది. 9:15 అన్నారు. దాని తర్వాత మళ్లీ డిలీట్ అయింది. అడిగితే 11:00 అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు అని అడిగితే 1:30 అంటున్నారు. ఇక్కడ ఎంతోమంది ఫ్రస్టేటెడ్ లో ఉన్నారు. నేను దగ్గరకు వెళ్లి అలయన్స్ వాళ్ళని పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారు.. కనీసం వాళ్ళకి భోజనం అయిన పెడతారా? నీళ్లు అయినా ఇస్తారా? కాఫీ, టీ అయిన ఇస్తారా? అడిగితే ఏమీ లేదని చెప్పారు.
ALSO READ: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!
అయితే ఇక్కడ పెద్ద వాళ్లే కాదు.. పిల్లలు కూడా ఈ అలయన్స్ ఎయిర్లైన్స్ ని ఇష్టపడడం లేదు. చూడండి ఇక్కడ ఎలా సఫర్ అవుతున్నారో అంటూ పిల్లలు పడుతున్న ఇబ్బందులను కూడా ఆమె వివరించారు. ఇక్కడ చూడడానికి అందంగా మాత్రమే ఉందని , కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అని, కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు అంటూ ఆ చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు.అలా అలయన్స్ ఎయిర్ లైన్స్ పై అసహనం వ్యక్తం చేశారు భార్గవి గాయత్రి. మరి దీనికి అలయన్స్ ఎయిర్ లైన్స్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
గాయత్రి భార్గవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటిగా ,యాంకర్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేసింది. యాంకర్ గా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. 2008లో సినీ రంగంలోకి అడుగుపెట్టి సినిమాలలో సహాయ నటి పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. బలాదూర్, తీన్మార్, అత్తారింటికి దారేది ,గాలిపటం , అవును, ఒక లైలా కోసం ,జనతా గ్యారేజ్ ఇలా ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించింది.
https://www.threads.com/share/BAhTscRrJJ/