E-Paper
Advertisement

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!
Advertisement

Bigg Boss boss 10 Trigun: బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ.. అటు టిఆర్పి రేటింగ్ లో కూడా దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 10 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 10 మంది సెలబ్రిటీలు 6 మంది కామనర్స్ తో పాటు 7 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ సీజన్ పై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఇకపోతే మొదటివారం చైత్ర ,చరణ్ ఎలిమినేట్ అయ్యారు.. కానీ చరణ్ కి రెండవ అవకాశం లభించింది. రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం ఎలిమినేషన్ లేకపోయినా వైల్డ్ కార్డు ద్వారా అదే వారం హౌస్ లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి బిగ్బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ తీసుకొని బయటకు వెళ్లిపోయారు. ఇక నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ అయింది. ఐదవ వారం చరణ్, అపూర్వ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు.

ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పిన త్రిగుణ్..

ఆరవ వారం నామినేషన్ లో భాగంగా మొత్తం 6 మంది నామినేట్ అయ్యారు. వంశీ, రాంప్రసాద్, అమన్, శాలిని, వర్షిని, రోహిత్ ఇలా మొత్తం 6 మంది నామినేట్ అయ్యారు. తాజాగా జరుగుతున్న ఓటింగ్ లిస్టులో వర్షిని , శాలిని లీస్టులో ఉన్నారు. మొదట వంశీ లేదా వర్షిని ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో తాజా ఎపిసోడ్ వంశీకి అనుకూలంగా మారింది. దీంతో అసలు ఈ ఆరవ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయంపై ముందే ఊహించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు త్రిగుణ్.

రోహిత్ కి నీతూ.. శాలిని అవుట్..

Advertisement

తాజా ఎపిసోడ్ లో భాగంగా.. వర్షిణి త్రిగుణ్ వద్దకు వచ్చి.. అందరూ నేను ఈ వారం ఎలిమినేట్ అవుతాను అంటున్నారు. ఆల్రెడీ ఈ వారం వంశీకి సింపతి ఎపిసోడ్ పడింది. కాబట్టి నేను ఎలిమినేట్ అవుతాను అంటూ తన మనసులో మాట బయట పెట్టింది. త్రిగుణ్ మాట్లాడుతూ.. ఈ వారం వంశీకి సింపతి ఎపిసోడ్ పడింది నిజమే కానీ ఈవారం నువ్వు ఎలిమినేట్ అవ్వవు. నిన్ను సేవ్ చేసి శాలినినీ పంపించేస్తారు. ముఖ్యంగా శాలిని హౌస్ లో ఎక్కువగా అరుస్తోంది. దీనికి తోడు రోహిత్ కి నీతూ వచ్చింది. శాలినీని పంపించేస్తే.. గేమ్ బెటర్ అవుతుంది. గొడవలు అవుతాయి అంటూ త్రిగుణ్ ఈ వారం.శాలిని ఎలిమినేట్ అవుతుంది అంటూ జ్యోతిష్యం చెప్పాడు.

వర్షిణి వద్ద పులిహోర కలిపిన త్రిగుణ్..

లేదు ఈ వారం నేనే ఎలిమినేట్ అవుతాను అని వర్షిణి అనగా.. త్రిగుణ్ నవ్వుతూ.. లేదు ఒకసారి ఇలా చూడు.. ఈ అందం లేకుండా ఇల్లు ఎలా ఉంటుంది? ఇంత గ్లామర్ లేకుండా ఈ ఇంట్లో మేము ఎలా ఉండగలుగుతాం ? అంటూ ఆమె వద్ద పులిహోర కలిపాడు.మొత్తానికి అయితే ఇందుకు సంబంధించిన విజువల్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ: భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ

వంశీకి సింపతి కార్డు వర్క్ అవుట్ అవుతుందా?

ఇకపోతే వంశీ అక్కడ నిజంగానే గేమ్లో గెలవలేకపోయాను అని బాధతో చెంప కేసి కొట్టుకున్నా.. ఆయన ఇక్కడ సింపతి ప్లే చేశారనే కామెంట్లు కొంతమంది నుండి వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా వంశీకే ఆ సింపతి ఓట్స్ రూపంలో పడుతూ ఆయన సేవ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి త్రిగుణ్ చెప్పినట్టు శాలిని బయటకు వెళ్ళిపోతుందా లేక వర్షిని ఆటలో తన ఎఫర్ట్ చూపించలేదనే కారణంతో బయటకు పంపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Related News

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత!

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Big Stories

Advertisement
×