Darsi Clash: ప్రకాశం జిల్లా దర్శిలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. నామినేషన్ల పర్వం సమయంలో స్థానిక ఎన్నికల కార్యాలయం వద్ద తెలుగుదేశం, వైకాపా వర్గాలు ఎదురుపడటంతో వాతావరణం వేడెక్కింది. ఇరువర్గాల వారు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పోలీసుల విధులకు ఆటంకం.. ఎస్సైపై దాడి
ఆదివారం మధ్యాహ్నం భారీ సంఖ్యలో వైకాపా శ్రేణులు ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి బయలుదేరాయి. నిబంధనల ప్రకారం ఆర్వో కార్యాలయం లోపలికి అందరికీ అనుమతి లేదని పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ వైకాపా నేతలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ తోపులాటలో పార్టీ జెండా కర్రలతో జరిపిన దాడిలో దర్శి ఎస్సై ఏడుకొండలు తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను మెరుగైన వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read: మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు
భారీ బందోబస్తు.. కొనసాగుతున్న ఉద్రిక్తత
తమ అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుంటున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. మరోవైపు, వైకాపా శ్రేణులే అసభ్యంగా ప్రవర్తించి పోలీసులపై దాడికి పాల్పడ్డాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు పట్టణంలో హై అలర్ట్ ప్రకటించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దర్శిలో ఉద్రిక్తత.. లాఠీచార్జ్ చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా దర్శిలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత
అభ్యర్థులతో వస్తున్న వైసీపీ నేతలను బారికేడ్లు పెట్టీ అడ్డుకున్న పోలీసులు
పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం
చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.. పలువురికి గాయాలు… pic.twitter.com/pes4hJtqeB— BIG TV Breaking News (@bigtvtelugu) October 18, 2026