E-Paper
Advertisement

ఐబ్రోస్ నచ్చలేదని నామినేషన్ చేస్తానంటున్న రామ్ ప్రసాద్..ఇదెక్కడి గోల రా మావా!

ఐబ్రోస్ నచ్చలేదని నామినేషన్ చేస్తానంటున్న రామ్ ప్రసాద్..ఇదెక్కడి గోల రా మావా!
Advertisement

Bigg boss 10: ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపుకు తెరదించుతూ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఘనంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 6 సాయంత్రం 7:00 గంటలకు పది మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ తో హౌస్ కళకళలాడింది. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అలా ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే కంటెస్టెంట్స్ సేఫ్ గేమ్ మొదలు పెట్టారా ? అని అనుమానాలు ఆడియన్స్ లో మొదలయ్యాయి. ఇదిలా ఉండగా చిన్న చిన్న వాటికి నామినేట్ చేస్తుండడం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఒక కంటెస్టెంట్ ఏకంగా నీ ఐబ్రోస్ కలర్ నచ్చలేదని నామినేట్ చేస్తానంటూ చేసిన కామెంట్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

నీ ఐబ్రోస్ కలర్ నచ్చలేదు.. అందుకే నామినేట్..

బిగ్ బాస్ సీజన్ 10 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో ఆటో రాంప్రసాద్, ప్రముఖ సీరియల్ నటి దేబ్జానీ మోదక్ కూడా ఒకరు. హాల్లో కూర్చుని మాట్లాడుతున్న సమయంలో దేబ్జానీ మోదక్ పక్కనే కూర్చున్న జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఆమెతో మాట్లాడుతూ..” నీ ఐబ్రోస్ కలర్ నాకు నచ్చలేదు. అందుకే నామినేట్ చేస్తున్నాను” అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. అయితే దానికి ఆమె మాట్లాడుతూ.. నా ఐబ్రోస్ కలర్ నచ్చక మీరు నామినేట్ చేస్తారా? అని అడగగా.. అవును నీ కళ్ళ వల్ల నా కళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కావాలంటే నరేష్ ను కూడా అడుగు అంటూ చెబుతాడు రామ్ ప్రసాద్. దేబ్జానీ నరేష్ ని అడుగుతూ..” మీకు కూడా నా ఐబ్రోస్ కలర్ ప్రాబ్లమా? అంటూ అడుగుతుంది.. దానికి నరేష్ చాలా అందంగా ఉన్నాయి. అదే నాకు ఇబ్బంది అవుతుంది అంటూ కామెంట్ చేశాడు. మరి రాంప్రసాద్ కామెడీగా అన్నాడా లేక సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అనే అనుమానాలు ఇప్పుడు ఆడియన్స్ లో మొదలయ్యాయి.

Advertisement

also read:జమీందారు వంశంలో పుట్టి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. ఎవరీ కంటెస్టెంట్?

నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలు..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ గా మారడంతో ఇదెక్కడి షో రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది హోస్ట్ నాగార్జున పదిరెట్లు భిన్నంగా ఉంటుంది అంటూ షోపై అంచనాలు పెంచేశారు.. అది ఇదేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే రాంప్రసాద్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నామినేషన్ ప్రక్రియ మొదలు..

Advertisement

ఇకపోతే ఆదివారం ఘనంగా బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం అయింది. మరి తొలివారం ఎలిమినేషన్ కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది . ఇక తొలివారం నామినేషన్స్ ఏ విధంగా జరగనున్నాయి? అనే విషయం తెలియాలి అంటే ఇంకొంతసేపు ఆగాల్సిందే. మొత్తానికైతే నామినేషన్ పేరిట ఎవరెవరు ఎవరిని ఉద్దేశించి ఏ విధంగా నామినేట్ చేయాలో అప్పుడే డిసైడ్ అవుతున్నారు అంటూ రాంప్రసాద్ మాటలు విన్న నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

జమీందారు వంశంలో పుట్టి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. ఎవరీ కంటెస్టెంట్?

మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!

ఒకేసారి 5 భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం.. ఏ హోస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Bigg Boss 10 Telugu : బెంగాలి బ్యూటీకి ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

బిగ్ బాస్ 10 లోకి విలన్ ఎంట్రీ.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Karthika Deepam 2 Serial Today Episode September 7th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: కార్తీక్‌ ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న శివనారాయణ

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాస్టర్ ప్లాన్.. గుణకు షాకిచ్చిన రోహిణి.. శృతి పై ప్రభా సీరియస్..

Big Stories

Advertisement
×