Bigg Boss 10: యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది సెలబ్రిటీలు, కామన్ పీపుల్స్ ఈ షోలో సందడి చేస్తున్నారు. తెలుగు విషయానికొస్తే.. ఎట్టకేలకు సెప్టెంబర్ 6 సాయంత్రం 7:00 గంటలకు స్టార్ మా, జియో హాట్ స్టార్ వేదికగా చాలా ఘనంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం అయింది. పదిమంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఎప్పటిలాగే నాగార్జున (Nagarjuna )హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు.
అంతా బాగానే ఉన్నా ముఖ్యంగా హౌస్ లోకి అడుగుపెట్టిన 10 మంది సెలబ్రిటీలకు సంబంధించిన ఏవీలు ఒక్కొక్కటిగా ప్రదర్శించారు. అందులో జమీందారుగా పుట్టి, హీరోగా కొన్ని సినిమాలలో నటించి, సహాయక పాత్రలతో ఆకట్టుకున్న ఒక నటుడు.. పదేళ్లు ఇండస్ట్రీకి దూరమై.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. దీంతో ఆయన ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి 13వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నటుడు కృష్ణుడు(Krishnudu ). ఈయన అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.
బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన ఈయన సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫోటోగ్రఫీ స్టూడియో నడుపుతూనే .. అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా తన కెరీర్ కొనసాగించారు.. హ్యాపీడేస్, పోకిరి, వాన, ఓయ్, యువత ఇలా కొన్ని చిత్రాలలో కమెడియన్ గా నటించి పేరు దక్కించుకున్న కృష్ణుడు.. హీరోగా అవతారం ఎత్తుదామనుకునే సమయంలో సడన్గా యాక్సిడెంట్ అయ్యింది. దాంతో భారీగా బరువు పెరిగిపోయారు. కలలన్నీ ఆవిరి అయిపోయాయి. సరిగ్గా అదే సమయంలో అనగా 2008లో వచ్చిన వినాయకుడు సినిమాతో హీరోగా నిలదొక్కుకొని , ఈ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు.
also read:సిగరెట్ తాగుతూ ప్రేయసితో అడ్డంగా బుక్కైన జయం రవి.. వీడియో వైరల్!
ఆ తర్వాత పప్పు, విలేజ్ లో వినాయకుడు, స్నేహ గీతం ఇలా పలు చిత్రాలు చేశారు. అంతేకాదు మిస్టర్ పర్ఫెక్ట్, ఆర్య 2 , మనం , ఎటో వెళ్లిపోయింది మనసు, గోపాల గోపాల ఇలా కొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా పోషించిన ఈయన.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో కనిపించలేదు.. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షోలో 13వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈయన ఇప్పుడు హౌస్ లో ఎన్ని వారాలు ఉంటారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ఇకపోతే కృష్ణుడు జమీందారీ కుటుంబానికి చెందినవారు. ఆయన ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఒక జమిందారీ కుటుంబంలో జన్మించారు. ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు.. చిన్నచింతనడా జమీందారుగా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 4500 ఎకరాల భూమిని వీరి కుటుంబం కోల్పోయింది. అలా జమీందారీ కుటుంబానికి చెందినప్పటికీ సినిమాలలో నటిస్తూ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు కృష్ణుడు.