Karthika Deepam2 : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సీరియల్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఏ సీరియల్ చూసినా కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడంతో.. జనాలు సీరియల్స్ ను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సీరియల్ అంటే కొంతమంది చూసేవారు కాదు కానీ ఇప్పుడు డిఫరెంట్ స్టోరీలతో పాటు సినిమాలను మించిన గ్రాఫిక్స్ కూడా ఉండడంతో ఎక్కువమంది ఈ సీరియల్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ కి ఈరోజుకి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇక్కడ ఉండే ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోవడంతో జనాలు దీనిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ సీరియల్లో సూరజ్ క్యారెక్టర్ ఇప్పుడిప్పుడే హైలెట్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ సీరియల్ కి దూరం అవుతుంది అని ఓ వార్తను ప్రచారంలో ఉంది అందులో నిజం ఎంత ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం..
స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ 2 ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇందులో నటిస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా జనాలని ఆకట్టుకోవడంతో.. ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ కి కాస్త రేటింగ్ తగ్గిన కూడా జనాలు మాత్రం సీరియల్ ని చూస్తూనే ఉన్నారు. అయితే ఈ ఇందులో మాలిని కి కొడుకుగా నటించిన సూరజ్ క్యారెక్టర్ బాగా హైలైట్ అవుతూ వస్తుంది. అయితే జ్యో కి సూరజ్ కి మధ్య కనెక్షన్ పెరగడంతో ఇద్దరు మధ్య ప్రేమ కూడా పుడుతుంది. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు సీరియల్ నుంచి కొన్ని కారణాల వల్ల తప్పుకుంటుంది అంటే జనాలు కాస్త డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కానీ ఇది మాత్రం నిజమని తెలుస్తుంది. మరి ఈ క్యారెక్టర్ నిజంగానే సీరియల్ నుంచి తప్పకుండా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ క్యారెక్టర్ వెళ్ళిపోతే సీరియల్ కి ఒక లోటు ఉంటుంది అని జనాలు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.
కార్తీక దీపం 2 లో సూరజ్ పాత్రలో శ్రీకర్ కృష్ణ నటించారు. ఈయన గతంలో చాలా సీరియల్స్ లలో నటించారు. బ్రహ్మముడి సీరియల్లో రాహుల్ అనే ప్లే బాయ్ క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించాడు.. ఆ తర్వాత కార్తీక దీపం2 సీరియల్లో నటిస్తున్నాడు. ఈ సీరియల్ అతనికి మంచి క్రేజ్ ను తీసుకొని వచ్చింది.. ఇప్పుడు కార్తీకదీపం 2 లో కూడా నటించడంతో ఎక్కువ మంది జనాలు ఈ యాక్టర్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సూరజ్ క్యారెక్టర్ ఎంత హైలెట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకున్న క్రేజ్ కేర్ రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే తీసుకుంటూ వస్తున్నాడు. సూరజ్ ఒక్క రోజుకి దాదాపు 35 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. మరి నెలకి ఈయన లక్షల్లోని సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు.