E-Paper
Advertisement

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!
Advertisement

Sabarimala Special Trains 2026: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే శబరిమల యాత్రా సీజన్‌ లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని పలు ప్రాంతాల నుంచి కేరళకు 148 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో శబరిమల యాత్రకు వెళ్లే వేలాది మంది అయ్యప్ప భక్తులకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. యాత్రా సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, కేరళకు వెళ్లే మార్గాల్లో టికెట్ల కోసం డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైల్వే  ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు!

శబరిమల యాత్రకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటారు. దీంతో రైల్వే స్టేషన్లు, రైళ్లలో రద్దీ పెరుగుతుంది. భక్తులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  యాత్రా సమయంలో కేరళకు వచ్చే అయ్యప్ప భక్తులకు నిరాటంకమైన ప్రయాణ సదుపాయాలు కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఏ రైల్వే జోన్ ఎన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది?

Advertisement

ఈ 148 ప్రత్యేక రైళ్లను వివిధ రైల్వే జోన్లు కలిసి ఆపరేట్ చేయనున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం వెల్లడించిన వివరాల ప్రకారం, రైల్వే జోన్ల వారీగా ప్రత్యేక రైళ్ల సంఖ్యను ప్రకటించారు.

సౌత్ సెంట్రల్ రైల్వే: 56 ప్రత్యేక రైళ్లు

Advertisement

సౌత్ రైల్వే: 32 ప్రత్యేక రైళ్లు

సౌత్ కోస్ట్ రైల్వే: 22 ప్రత్యేక రైళ్లు

ఈస్ట్ కోస్ట్ రైల్వే: 20 ప్రత్యేక రైళ్లు

సెంట్రల్ రైల్వే: 18 ప్రత్యేక రైళ్లు

ఈ లిస్టులో సౌత్ సెంట్రల్ రైల్వే అత్యధికంగా 56 ప్రత్యేక రైళ్లను నడపనుంది. దక్షిణ రైల్వే 32 రైళ్లతో రెండో స్థానంలో ఉంది. మిగతా రైల్వే జోన్లు కూడా తమ పరిధిలోని మార్గాల్లో ప్రత్యేక సర్వీసులను నిర్వహించనున్నాయి.

మొత్తం 362 ట్రిప్పులు

తొలి దశలో ఈ 148 ప్రత్యేక రైళ్లు కలిపి మొత్తం 362 ట్రిప్పులను పూర్తి చేయనున్నాయి. అంటే, ఒకే రైలు పలుమార్లు ప్రయాణించేలా సర్వీసులను ప్లాన్ చేశారు. దీంతో యాత్రా సీజన్‌లో ప్రయాణికులకు అదనపు రైలు సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఏయే రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి? ప్రయాణ తేదీలు ఏంటి? టైమింగ్స్ ఎలా ఉంటాయి? టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి? అనే పూర్తి వివరాలను రైల్వే త్వరలో అధికారులు వెల్లడించనున్నారు. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఈ ప్రత్యేక రైలు సర్వీసులు కీలక పాత్ర పోషించనున్నాయి.

Read Also: అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

Tags

Related News

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

Big Stories

Advertisement
×