Gundeninda Gudigantalu Balu : స్టార్ మా చానల్లో ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతూ ఉంటాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అందులో ఒకటి గుండెనిండా గుడిగంటలు ఒకటి. ఈ సీరియల్ జనాలను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. డిఫరెంట్ స్టోరీ తో ఉన్న ఈ సీరియల్ మధ్యతరగతి కుటుంబంలోని మనుషుల గురించి చెప్తుంది. కుటుంబంలోని మనుషులకు డబ్బు మీద వ్యామోహంతో ఉన్న కొందరు మనుషులు మనుషులని మనుషులకు అవమానిస్తూ మాట్లాడుతుంటారు.. అలాంటి వారికి ఈ సీరియల్ ఎప్పుడు కరెక్టుగానే అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సీరియల్ లో బాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా మాత్రమే కాదు ఒక మంచి మనిషిగా అందరినీ ఆకట్టుకున్నాడు. బాలు గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తుంది. తాజాగా ఈ హీరో బిగ్ బాస్ లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. బాలుకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే అని టాక్ నడుస్తుంది. మరి నిజంగానే బాలు బిగ్ బాస్ కు వెళ్తున్నాడా..? వెళ్తే ఎంత రెమ్యూనరేషన్ ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం..
బాలు బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య బాలు ఒక వీడియో ద్వారా తీర్చ కూడా ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. బాలు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చినట్టు వార్తలు వీడియో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోతో బాలు నిజంగానే బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడా? మొన్నటివరకు వెళ్లను అన్నాడు. కానీ ఇప్పుడు వెళ్తాను అని అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బిగ్ బాస్ లోకి వెళ్తే అతనికి ఉన్న క్రేజ్ కారణంగా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం బాలుకు ఒక్కరోజుకు దాదాపు 2 లక్షలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే బాలు ఎలిమినేట్ అయిన కూడా బాగానే డబ్బులను సంపాదించుకుంటాడు. మరి ఇవాళ జరగబోయే బాస్ గ్రాండ్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారో అన్నది ఆసక్తిగా మారింది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోగా నటిస్తున్న బాలు అసలు పేరు విష్ణుకాంత్.. ఇతను ఒక తమిళ్ నటుడు. తమిళంలో పలు సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సీరియల్స్లలో నటించి నటుడిగా తమిళ్ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగులో ఈయన ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ గుండెనిండా గుడిగంటలు. ఈ సీరియల్లో హీరోగా నటించిన బాలు తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. స్టార్ మా లో ప్రసారమవుతున్నాయి సీరియల్ ప్రస్తుతం మంచి రేటింగ్ తో తీసుకుపోతుంది. దీంతోపాటుగా జెమినీ టీవీలో కూడా మా ఇంటి దేవత అనే సీరియల్ లో బాలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులో కాలు నటించినందుకుగాను ఒక్కో సీరియల్ 50 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి మంచి రెమ్యూనికేషన్ తోనే అడుగుపెట్టాడు.. ఒకవేళ బాలు నిజంగానే బిగ్ బాస్ లోకి వెళ్తే ఇప్పుడు ఆ సీరియల్ లోకి కొత్త హీరో రాబోతున్నాడు అన్నది ఆసక్తిగా మారింది. మరి ఏ హీరో రాబోతున్నాడు అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసా అవకాశం ఉంది..
Also Read : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..