E-Paper
Advertisement

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
Advertisement

Madhapur Incident: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ విషాదం మాదాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి మాలిక్ (29) చంద్రనాయక్ తాండాలోని ఓ అపార్ట్ మెంట్లో ఉంటోంది. మాదాపూర్‌ మైండ్‌స్పేస్ లోని ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తోంది.

భార్య నుంచి విడాకులు..

ఉత్తరాఖండ్‌ కు చెందిన సహోద్యోగి విమల్‌ తో గత నాలుగేళ్లుగా ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విమల్‌ కి ఇప్పటికే వివాహమైంది. అయితే, అతను భార్య నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా, ఆదివారం తెల్లవారుజామున విమల్ కు వీడియో కాల్ చేసిన అర్చన పెళ్లి గురించి మాట్లాడినట్టు విచారణలో తెలిసింది. భార్య నుంచి విడాకులు తీసుకున్నాక పెళ్లి గురించి ఆలోచిద్దామని విమల్ చెప్పినట్టుగా తెలియవచ్చింది.

ఉరి వేసుకుని..

Advertisement

దాంతో అర్చన ఫోన్ కాల్ కట్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత విమల్ కాల్ చేసినా ఆమె స్పందించలేదు. దాంతో విమల్ అపార్ట్‌మెంట్‌ కు చేరుకుని చూడగా తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు తట్టినా సమాధానం రాకపోవటంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా అర్చన సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉన్న స్థితిలో కనిపించింది. పరీక్షించగా అప్పటికే అర్చన చనిపోయినట్టు నిర్ధారణ అయ్యింది.

Also read: 6 నెలలు.. 23 ఉరిశిక్షలు.. సంచలన జడ్జి రవికుమార్ దివాకర్ సడన్ ట్రాన్స్‌ఫర్!

Tags

Related News

FCI బియ్యం సరఫరాలో భారీ అక్రమాలు.. 14 మంది మిల్లర్లు అరెస్ట్!

ఒక్క ఫోన్ కాల్‌తో సీన్ రివర్స్.. కారులో రూ.2.40 లక్షలతో ఏసీబీకి చిక్కిన వాటర్ బోర్డ్ JD!

మాదాపూర్, ఐటీ కారిడార్ వాసులకు గుడ్ న్యూస్..?

టీజీ-ఐపాస్ సర్వర్‌ హ్యాక్.. హ్యాకర్లు ఏం డిమాండ్ చేశారో తెలిస్తే షాకవుతారు!

ఎల్ నినో కరువు మండలాల లెక్కింపుపై.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

టికెట్ గొడవ.. కండక్టర్‌ను రన్నింగ్ బస్సులోంచి తోసేసిన మహిళ!

ఆదిలాబాద్ జిల్లా ST కుల ధృవీకరణ పత్రాల వివాదానికి.. ప్రభుత్వం చెక్!

Big Stories

Advertisement
×