E-Paper
Advertisement

బిగ్ బాస్ పై సోనియా షాకింగ్ కామెంట్స్..గుర్తింపు రాలేదు అంటూ!

బిగ్ బాస్ పై సోనియా షాకింగ్ కామెంట్స్..గుర్తింపు రాలేదు అంటూ!
Advertisement

Big Tv Kissik Talks : బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ప్రతివారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న ఎన్నో అంశాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు . ఈ నేపథ్యంలోనే ఈ వారం ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, సినీనటి సోనియా ఆకుల(Sonia Akula) హాజరై సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడారు.

బిగ్ బాస్ ప్లస్ అయ్యింది..

ఇకపోతే సినీ నటిగా అందరికీ పరిచయమైన సోనియా బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం చివరి వరకు ఈమె ఉంటుందని అందరూ భావించారు కానీ హౌస్ లోకి వెళ్ళిన నాలుగవ వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఈమె హౌస్ లో ఉన్నది నాలుగు వారాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి యాంకర్ వర్ష ప్రశ్నించారు. బిగ్ బాస్ కార్యక్రమం మీకు ప్లస్ అయిందా? లేదా మైనస్ అయిందా? అంటూ ప్రశ్నించడంతో సోనియా సమాధానం చెబుతూ ఈ కార్యక్రమం తనకు ఒక విధంగా మంచి గుర్తింపు తీసుకువచ్చిందని తెలియజేశారు.

సెంట్రల్ మినిస్టర్ నుంచి ఫోన్ కాల్..

Advertisement

తాను బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అవగానే మాల్దీవులకు వెళ్లాను అయితే అక్కడ తనని గుర్తుపట్టి మీరు బిగ్ బాస్ హౌస్లో చాలా బాగా ఆడారు. ఏ విషయం అయినా నిర్మొహమాటంగా మాట్లాడారు అంటూ తన గురించి చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది . అది తనకు చాలా ప్లస్ అని సోనియా తెలిపారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో నా మాట తీరు చూసి ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా తనకు ఫోన్ చేశారని, మీలాంటి వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? ఈ వాయిస్ పార్లమెంట్ లో ఉండాలి అంటూ తనకు ఫోన్ కాల్ చేశారని సోనియా తెలిపారు. అయితే ఆ సెంట్రల్ మినిస్టర్ ఎవరు అనే విషయాలను మాత్రం ఈమె తెలియజేయలేదు.

Advertisement

తాను తన డిగ్రీ పూర్తి అవగానే ఎన్నో ఎన్జీవో సంస్థలతో కలిసి ఎంతో సోషల్ సర్వీస్ చేశాను అయినప్పటికీ నాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. నా దగ్గర ₹1000 ఉంటే 500 తాను ఇలాంటి పనులకే ఉపయోగించే దాన్ని ఇలా ఇంత సర్వీస్ చేసినప్పటికీ రాని గుర్తింపు తనకు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా వచ్చిందని, ఈ రియాలిటీ షో తనకు చాలా ప్లస్ అయింది అంటూ సోనియా ఈ కార్యక్రమంలో భాగంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె నాలుగు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇస్తారని భావించారు కానీ సోనియా మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు. ఇక ఈ కార్యక్రమం అనంతరం పెళ్లి చేసుకున్న సోనియా ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తనకు ఇప్పుడిప్పుడే అవకాశాలు కూడా వస్తున్నాయి అంటూ తెలియచేశారు.

Also Read: డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

Related News

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Big Stories

Advertisement
×