E-Paper
Advertisement

హిమాలయాల్లో పగిలిన మంచు కొండ.. 2,500 మందికి పైగా గల్లంతు!

హిమాలయాల్లో పగిలిన మంచు కొండ.. 2,500 మందికి పైగా గల్లంతు!
Advertisement

Tibet Floods: నేపాల్‌-టిబెట్ సరిహద్దులో.. గైరాంగ్ పోర్ట్ దగ్గర వచ్చిన ఆకస్మిక వరదలు, బురద ప్రవాహం అన్నింటినీ ముంచెత్తాయి. హిమాలయాల్లో హిమానీనదం విరిగిపడటంతో నీళ్లు, రాళ్లు, బురద కలిసి ఊళ్లపైకి దూసుకొచ్చాయి. నేపాల్‌లో 700 మందికిపైగా చనిపోయినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. దాదాపు 2,500 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. వేలాది మంది యాత్రికులు, విదేశీ పర్యాటకులు ఈ విపత్తులో చిక్కుకున్నారు. కానీ సరిహద్దుకు ఆవల టిబెట్‌లో ఏం జరిగిందన్నది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది.

ఎవరు చిక్కుకున్నారు?

టిబెటన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను చైనా సెన్సార్‌షిప్ చేసి.. గంటల్లోనే తొలగించిందనే ఆరోపణలు వస్తున్నాయ్. గైరాంగ్ పోర్ట్‌ను వరద ముంచెత్తుతున్న సీసీటీవీ విజువల్.. వరల్డ్ వైడ్ వైరల్ అయినా, చైనా ఇంటర్నెట్‌లో మాత్రం అది మాయమైపోయింది. చైనా ప్రభుత్వ టీవీ.. ఆ వీడియో నుంచి ఒకే ఒక్క ఫొటోను మాత్రమే చూపించిందని.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయ్. టిబెట్‌లో ఐదుగురు చనిపోయినట్టు, 5 వందల మందికి పైగా గల్లంతైనట్టు చైనా అధికారికంగా ప్రకటించింది. వారిలో 260 మంది విదేశీయులు ఉన్నారు. కానీ ఏ ఊళ్లో ఎవరు చిక్కుకున్నారు? ఎవరికి సాయం కావాలన్న కనీస సమాచారం బయటకు రావడం లేదని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ్.

Advertisement

Also read: ప్రీతి జింటాకు వెన్నుపోటు…శ్రేయాస్ అయ్య‌ర్ యూ-ట‌ర్న్ ?

జర్నలిస్టులకు ప్రవేశం లేదు..

టిబెట్‌లోకి విదేశీ జర్నలిస్టులకు ప్రవేశం లేదు. స్థానికులు కూడా బయటి మీడియాతో స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఉందని హ్యూమన్ రైట్స్ వాచ్ గతంలోనే తెలిపింది. కోవిడ్ సమయంలోనూ చైనా ఇలాంటి సెన్సార్‌షిప్‌నే ప్రయోగించిందని గుర్తుచేస్తున్నారు. ఒకవైపు నేపాల్ మాత్రం విదేశీ జర్నలిస్టులను వరద ప్రాంతాల్లోకి అనుమతించి, పారదర్శకంగా వ్యవహరిస్తోంది. మరోవైపు చైనా మాత్రం సైన్యం సహాయక చర్యలు, హెలికాప్టర్ల ఆపరేషన్లను మాత్రమే గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. వరద నీళ్లు తగ్గొచ్చు. కానీ టిబెట్‌లో ఎంతమంది గల్లంతయ్యారన్న ప్రశ్న మాత్రం మిస్టరీగానే మిగిలిపోతోంది. ఓవైపు వందల మంది గల్లంతయ్యారని నేపాల్, భారత్ ప్రభుత్వాలు ఆందోళన చెందుతుంటే.. చైనా మాత్రం తన ఇమేజ్ కు డ్యామేజ్ కాకుండా చూసుకుంటోంది.

Advertisement

Also read: పుంగనూరులో టీడీపీ ఇంచార్జి మార్పు కలకలం.. వేదికపైనే కన్నీటి పర్యంతమైన చల్లా బాబు!

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఢిల్లీ హవా.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్లు!

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

Big Stories

Advertisement
×