E-Paper
Advertisement

Big Tv Kissik Talks: తనూజ బిగ్ బాస్ జర్నీ పై హారిత కామెంట్స్…ఆ కన్నీళ్ల కష్టం మీకేం తెలుసంటూ?

Big Tv Kissik Talks: తనూజ బిగ్ బాస్ జర్నీ పై హారిత కామెంట్స్…ఆ కన్నీళ్ల కష్టం మీకేం తెలుసంటూ?
Advertisement

Big Tv Kissik Talks: బుల్లితెర సీరియల్ నటి , బుల్లితెర శివగామిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నటి హరిత(Haritha) తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి, బిగ్ బాస్ కంటెస్టెంట్ తనూజ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. తనూజ కోసం హరిత బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. గతంలో తాను నాగార్జున గారితో కలిసి సినిమాలు చేశాను అయితే అప్పుడు ఎంత ఆప్యాయంగా పలకరించారో ఇప్పుడు కూడా అంతే ఆప్యాయంగా పలకరించారని, నాగార్జున గారిని చూడగానే పుట్టింటికి వెళ్ళిన భావన కలిగిందని తెలిపారు.

తనూజ అద్భుతంగా ఆడింది..

ఇక కంటెస్టెంట్ తనూజ గురించి హరిత మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య 11 సంవత్సరాల బాండింగ్ ఉందని తెలిపారు. తను బిగ్ బాస్ వెళ్లడానికి ముందు రోజు రాత్రి కూడా మా ఇంటికి వచ్చి నన్ను కలిసి మా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిందని, మా మధ్య అంత మంచి బాండింగ్ ఉందని హరిత తెలిపారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా తనూజ హౌస్ లో గేమ్ ఆడిందని , తన డ్రెస్సింగ్ స్టైల్ లో కానీ మాట్లాడే విధానం కానీ తన హక్కుల గురించి కానీ చాలా అద్భుతంగా ఫైట్ చేసిందని తెలిపారు.

మీకు కన్నీళ్లు మాత్రమే.. మాకు జీవితం..

Advertisement

తనూజ నాకు ఎప్పుడూ ఒకటే విషయం చెబుతుంది అమ్మ రియల్ లైఫ్ లో మీరు హరిత అమ్మ లాగ ఉండాలి. రీల్ లైఫ్ లో మాత్రం అఖిలాండేశ్వరిగా ఉండాలని చెబుతూ ఉంటుంది. చాలామంది హౌస్ లో తను డ్రామా చేస్తుంది అని మాట్లాడారు అలాగే ముద్దమందారం గురించి మీరు ఎమోషనల్ అయ్యారు అంటూ వర్ష ప్రశ్నించగా ఎవరైనా ఒక మాట అనడం చాలా సింపుల్ గా అనేస్తారు కానీ ఆ మాట వల్ల ఇతరులు ఎంత బాధ పడతారనేది ఎవరు ఆలోచించరు. ఇలాంటి కామెంట్లకు నేను ఏడ్చను. ఒకవేళ ఏడ్చాను అంటే ప్రతిదానికి ఏడుస్తుంది అంటూ మాట్లాడుతారు. మా కన్నీళ్ళ వెనుక ఎంత కష్టం ఉంది.. మీకు అవి కన్నీళ్లు లాగా మాత్రమే కనిపిస్తాయి కానీ మాకు మేము నడిచొచ్చిన దారి అని తెలిపారు.

Advertisement

ముద్దమందారం సీరియల్ వాళ్లకు ఒక మందారం మాత్రమే కానీ మాకు జీవితం. మాట్లాడే వారికి మనం ఎన్ని చెప్పినా మాట్లాడుతూనే ఉంటారు అలాంటివి పట్టించుకుంటే మనం అక్కడే ఆగిపోతాం తప్ప ముందుకు వెళ్ళమని హరిత తెలియజేశారు. మనల్ని బాధ పెట్టడానికి అడుగడుగున ఉంటారని అలాంటి వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఒకప్పుడు సీరియల్స్ ఎందుకు పెళ్లి చేయొచ్చు కదా అన్నారు . ఇప్పుడు వాళ్లే మీ సీరియల్స్ బాగున్నాయి అంటూ మాట్లాడుతున్నారు ఇదే కదా నిజమైన సక్సెస్ అంటూ విమర్శలపై కూడా హరిత క్లారిటీ ఇచ్చారు.

Also Read: Big Tv Kissik Talks: సక్సెస్ ఏంటో తెలియదు.. నటిగా దక్కిన గౌరవం అదే.. హరిత ఎమోషనల్ ..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×