E-Paper
Advertisement

Palm Oil: పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. టన్నుకు 21 వేలు చేరుకున్న ధర

Palm Oil: పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. టన్నుకు 21 వేలు చేరుకున్న ధర
Advertisement

Palm Oil: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటికి టన్నుకి ఆయిల్ పామ్ గెలల ధర రూ.12,534 ఉండగా ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధర రూ21,546 పెరగడం తో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రివర్యులు పేర్కొన్నారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక ధరలను అందించి ఆయిల్ పామ్ సాగును లాభ సాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.

రైతులు ఆనందం వ్యక్తం

ఆయిల్ ఫెడ్ వారి ప్రోసెసింగ్ మిల్లులలో నూనె రికవరీ శాతం, ముడి పామాయిల్ అమ్మకం ధరల ఆధారంగా ప్రతి నెల ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయించడం జరుగుతుందన్నారు. అయితే తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా నడపబడుతున్న అప్పరావ్ పేట, అశ్వరావుపేటలోని ఆయిల్ పామ్ కర్మాగారాలలో నూతన టెక్నాలజీతో కొత్త యంత్రాలు ఏర్పాటు చేయడం,ఉన్న యంత్రాలను అధునికరించడం వల్ల ఆయిల్ పామ్ గెలల నుండి వచ్చే నూనె రికవరీ శాతం (ఓఈఆర్) టన్నుకు 20.01 శాతముకు పెరగడం వల్ల టన్నుకు ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించబడిన ఆయిల్ పామ్ గెలల ధరను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవ్వాల్సిరావడంతో అక్కడ పామ్ ఆయిల్ రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతున్నదని మంత్రి తెలిపారు.

Advertisement

Also Read; Vijay Divorce: దళపతి విజయ్‌కు షాక్ ఇచ్చిన జేసన్ విజయ్.. ఏం చేశాడంటే?

దీర్ఘకాలిక లాభాలు

రాష్ట్రంలో 1992-93 నుంచి ఇప్పటి వరకు 2.90 లక్షల ఎకరాలను (79,113 రైతులు) ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగిందని, ఈ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 1,07,400 ఎకరాలలో 33500 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టరని 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు కోసం 456 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో మరో రెండు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 68,600 ఎకరాల నుండి ఆయిల్ పామ్ గెలల ఉత్పత్తి జరుగుతున్నదని అన్నారు. రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించెందుకు ఏకరాకు రూ.50,918 రాయితిని నాలుగు సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతున్నదని, దీర్ఘకాలిక లాభాల నుండి ఆయిల్ పామ్ సాగు కోసం రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు రావాలని మంత్రి కోరారు.

Advertisement

Also Read: World Longest Range EV: ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,000 కి.మీ ప్రయాణం, కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×