E-Paper
Advertisement

Hyderabad Traffic Police: ఆటో ఇస్తారా.. పామును వదలమంటారా? ట్రాఫిక్ పోలీసులకు డ్రైవర్ వింత బెదిరింపు!

Hyderabad Traffic Police: ఆటో ఇస్తారా.. పామును వదలమంటారా? ట్రాఫిక్ పోలీసులకు డ్రైవర్ వింత బెదిరింపు!
Advertisement

Hyderabad Traffic Police: మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొందరు వినడం లేదు. పైగా పట్టుబడ్డాక పోలీసులనే బెదిరించే స్థాయికి వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ చేసిన పని చూసి ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. సీజ్ చేసిన తన ఆటోను తిరిగి ఇవ్వకపోతే.. పామును వదులుతానంటూ డ్రైవర్ పోలీసులను బెదిరించాడు.

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ ఆటోను ఆపి డ్రైవర్‌ను పరీక్షించారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో అతడికి ఏకంగా 150 రీడింగ్ వచ్చింది. నిబంధనల ప్రకారం పరిమితికి మించి మద్యం సేవించి ఉండటంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేశారు.

Advertisement

అయితే, ఆటోను వదిలి వెళ్ళడానికి ఇష్టపడని డ్రైవర్.. వాహనంలో తన సామాగ్రి ఉందని, అది తీసుకుంటానని చెప్పి ఆటో దగ్గరకు వెళ్లాడు. అకస్మాత్తుగా ఆటోలో దాచిన ఓ పామును బయటకు తీసి తన చేతికి చుట్టుకున్నాడు. నడిరోడ్డుపై పాముతో హల్ చల్ చేస్తూ.. “నా ఆటో నాకు ఇస్తారా.. లేక పామును వదలమంటారా” అంటూ పోలీసులను బెదిరించాడు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వారు తేరుకుని అతడిని పట్టుకునేలోపే.. సదరు డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఆ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×