E-Paper
Advertisement

Parakamani Theft Case: పరకామణి చోరీ కేసు.. నిందితుడు రవి కీలక వ్యాఖ్యలు, సీబీఐకి వెళ్లే ఛాన్స్?

Parakamani Theft Case: పరకామణి చోరీ కేసు.. నిందితుడు రవి కీలక వ్యాఖ్యలు, సీబీఐకి వెళ్లే ఛాన్స్?
Advertisement

Parakamani Theft Case: టీటీడీ పరకామణిలో డాలర్ల చోరీ కేసు కొత్త మలుపు తిరుగుతోందా? ఆనాటి ప్రభుత్వం వైసీపీ మాటలు ఒకలా? నిందితుడు రవికుమార్ మాటలు మరొకలా ఉన్నాయా? అసలు ఈ చోరీ కేసులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి? సీఐడీ అందజేసిన వివరాలపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ నేపథ్యంలో కీలక నిందితుడు రవికుమార్ విడుదల చేసిన వీడియో దుమారం రేపుతోంది.

పరకామణి చోరీ కేసులో ఏం జరుగుతోంది?

Advertisement

పరకామణి చోరీ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీని చిన్న తప్పుగా వర్ణించారు మాజీ సీఎం జగన్. దీనిపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. స్వామి హుండీ డబ్బులు దొంగలిస్తే చిన్న తప్పా? ఈ విషయంలో నిందితులను జగన్ వెనుకేసుకు రావడంపై దుమారం తారాస్థాయికి చేరింది. పరిస్థితి గమనించిన నిందితుడు రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

రెండేళ్ల కిందట పరకామణిలో తాను చోరీ చేసినట్టు ఒప్పేసుకున్నాడు. తనను బ్లాక్‌ మెయిల్ చేశారంటూ నాలుగైదు నిమిషాల నిడివి గల వీడియో విడుదల చేశారు.  భార్యాపిల్లలు తలుచుకుని బాధపడని రోజు లేదని, దయచేసి తమను చేసుకోవాలని కోరాడు. ఆ తప్పును మహాపాపంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు.

Advertisement

నిందితుడు రవి కీలక వ్యాఖ్యలు, సీబీఐకి వెళ్లే ఛాన్స్?

అందుకు ప్రాయశ్చిత్తంగా 90 శాతం తన ఆస్తిని శ్రీవారికి రాసిచ్చినట్టు మనసులోని మాట బయటపెట్టారు. తనను కొంతమంది బ్లాక్‌ మెయిల్ చేశారని బయటపెట్టాడు. తాను, తన కుటుంబం తీవ్ర క్షోభ అనుభవిస్తున్నామని వెల్లడించాడు.  కానీ, కొంతమంది తమపై పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.

ఇప్పటికైనా తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశిస్తే ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్దమేనని చెప్పాడు.  రవికుమార్ మాటలు గమనించినవాళ్లు మాత్రం కొందరు నేతల ఒత్తిడి వల్ల ఆ వీడియో రిలీజ్ చేశాడని అంటున్నారు.  ఏడాదిగా అజ్ఞాతంలో ఉన్న ఆయన, ఇప్పుడు వీడియో రిలీజ్ చేయడంపై  ఏదో కారణం ఉండే ఉంటుందని అంటున్నారు.

ALSO READ: సీఎం చంద్రబాబు సమీక్షలో తేలింది అదే, టార్గెట్ ఆ 37 మంది?

ఇన్నాళ్లు దీనిపై రవికుమార్ ఎందుకు నోరెత్తలేదు. సీఐడీ దర్యాప్తు చేసి, హైకోర్టుకి నివేదిక ఇచ్చిన తర్వాత ఆయన వీడియో రావడం వెనుక అసలు ఏం జరిగిందంటూ కొంతమంది ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక దర్యాప్తు చేసిందని అంటున్నారు. సీఐడీ నివేదికను పరిశీలించిన తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించినా ఆశ్యర్యపోనక్కర్లేదని అంటున్నారు. అదే జరిగితే మీడియా ముందు మాజీ మంత్రి జగన్ వ్యాఖ్యలు కీలకంగా మారుతాయని అంటున్నారు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×