Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమం చాలా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతి వారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు హాజరవుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డి(Mithilesh Reddy) పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఇందులో భాగంగా మిథిలేష్ బిగ్ బాస్ కార్యక్రమం గురించి అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నటుడు కింగ్ నాగార్జున (Nagarjuna) గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. నాగార్జున గారి గురించి ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే ఏం చెబుతారు అంటూ మిథిలేష్ రెడ్డికి ప్రశ్న ఎదురు కావడంతో..మిథిలేష్ సమాధానం చెబుతూ.. నాగార్జున గారితో తాను స్టేజ్ పై ఉన్నప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను.. నాగార్జున గారికి నేను పెద్ద అభిమానిని..ఫిట్ నెస్ విషయంలో నాగార్జున గారు మా అందరికీ స్ఫూర్తి అని మిథిలేష్ తెలిపారు. ఇప్పుడు మనం ఎంత పొటెన్షియల్ తో ఉన్న ఆ ఏజ్ లో అలా ఫిట్ గా ఉండడం చాలా గ్రేట్ అంటూ నాగార్జున ఫిట్ నెస్ గురించి మిథిలేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నాగార్జున గారి నుంచి ఫిట్ నెస్, డిస్ప్లేన్ మనం నేర్చుకోవాలని తెలిపారు. లెజెండ్ అని మనం ఊరికే అనం కదా … నాగార్జున గారు వేరే లెవెల్ అంటూ మిథిలేష్ ఈ సందర్భంగా నాగార్జున గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున ఆరుపదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా ఎంతో యాక్టివ్ గా, అదే చలాకితనంతో ఫిట్ గా కనపడుతూ అందరికీ స్ఫూర్తిగా ఉంటున్నారు. ఇక నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమం హోస్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈయన సీజన్ 3 నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి హోస్టుగా కొనసాగుతున్నారు.
ఇక మిథిలేష్ విషయానికి వస్తే ఈయన అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ 10(Bigg Boss 10) కార్యక్రమానికి ఎంపిక అయ్యారు. ఈ కార్యక్రమానికి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన మిథిలేష్ హౌస్ లోకి కేవలం రెండు రోజులు పాటు మాత్రమే ఉండి ఏకంగా బిగ్ బాస్ ఇచ్చిన 15 లక్షల రూపాయల ఆఫర్ ఉపయోగించుకుంటూ 15 లక్షల సూట్ కేస్ తో ఈయన హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా రెండు రోజులకే 15 లక్షల రూపాయలతో మితిలేష్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఒక్కసారిగా సెన్సేషనల్ అయ్యారు. బహుశా ఈయన బిగ్ బాస్ హౌస్లో చివరి వరకు ఉన్నా కూడా రాని గుర్తింపు రెండు రోజులకే 15 లక్షలు తీసుకొని రావడంతో వచ్చిందని చెప్పాలి.
Also Read: బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్.. గుట్టు రట్టు చేసిన మిథిలేష్!