E-Paper
Advertisement

కడుపున పుట్టిన పిల్లలకే ఆ తల్లి మృత్యువుగా మారితే… వెన్నులో వణుకు పుట్టించే హారర్ ను చూశారా?

కడుపున పుట్టిన పిల్లలకే ఆ తల్లి మృత్యువుగా మారితే… వెన్నులో వణుకు పుట్టించే హారర్ ను చూశారా?
Advertisement

Indonesian Horror Thriller: తల్లి ప్రేమకు మించినది ఏదీ లేదంటారు. తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే అమ్మ… వాళ్లకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. కానీ అదే తల్లి తన పిల్లల ప్రాణాలకే ముప్పుగా మారితే ? ఒకప్పుడు ప్రేమగా చూసుకున్న అమ్మే… ఒక్కసారిగా వింతగా ప్రవర్తిస్తూ, తనను నమ్మిన పిల్లలపై దాడి చేస్తే… ఆమె ప్రవర్తన వెనుక మానసిక సమస్య ఉందా, లేక ఏదైనా దుష్టశక్తి ఆవహించిందా ? ఇలాంటి భయంకరమైన కథతో తెరకెక్కిన ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ ‘ఎ ఉమెన్ కాల్డ్ మదర్’ (A Woman Called Mother). మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

విరా, డినో ఇద్దరూ తమ తల్లి యాంతితో కలిసి కొత్త ఇంట్లో జీవించడం ప్రారంభిస్తారు. తండ్రి నుంచి విడిపోయిన తర్వాత యాంతి తీవ్ర మానసిక వేదనకు గురవుతుంది. అయితే కొంతకాలానికి ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. గతంలో కంటే ఉత్సాహంగా, అందంగా కనిపిస్తూ కొత్త ఇంటిని కొనుగోలు చేస్తుంది. అక్కడే ఓ సెలూన్ ప్రారంభిస్తుంది. ఆ ప్రాంతం మారుమూలలో ఉన్నప్పటికీ ఆమె వ్యాపారం మాత్రం అనూహ్యంగా బాగా సాగుతుంది.

Advertisement

మొదట తల్లి మళ్లీ సంతోషంగా ఉండటం చూసి విరా ఆనందిస్తుంది. కానీ కొద్దిరోజులకే పరిస్థితి చేంజ్ అవుతుంది. యాంతి కొన్నిసార్లు తనను తాను కంట్రోల్ చేసులేకపోతుంది. సెలూన్‌ కు వచ్చిన కస్టమర్లపై దాడి చేయడం, ఇంట్లో వింతగా ప్రవర్తించడం, చివరకు తన కొడుకు డినోపైనా దాడి చేయడానికి ప్రయత్నించడం మొదలు పెడుతుంది. అయితే మరుసటి రోజు మాత్రం ఏమీ జరగనట్టుగా మామూలుగా ఉంటుంది. దీంతో విరాకు తన తల్లి ప్రవర్తనపై అనుమానం పెరుగుతుంది.

అసలు యాంతికి ఏమైందో తెలుసుకోవడానికి విరా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వారి బంధువు జమాల్‌ ను ప్రశ్నించగా, తల్లి గతంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడేందుకు ఓ మంత్రగత్తెను ఆశ్రయించిన విషయం తెలుస్తుంది. సాధారణ చికిత్సతో తన బాధ తగ్గకపోవడంతో యాంతి మేడియా అనే మంత్రగత్తెను కలుస్తుంది. ఆమె యాంతిలోని స్త్రీగా జీవించాలనే కోరికకు, తల్లిగా ఉండాల్సిన బాధ్యతలకు మధ్య ఉన్న సంఘర్షణను వేరు చేయడానికి ఓ ప్రమాదకరమైన ఆచారాన్ని నిర్వహిస్తుంది.

Advertisement

కానీ ఆ ఆచారానికి ఓ షరతు ఉంటుంది. నిర్దిష్ట పద్ధతిలో కోడి రక్తంతో బలి ఇవ్వాలి. యాంతి అనుకోకుండా తన కొడుకు రక్తాన్ని రుచి చూడటంతో ఆ ఆచారం కలుషితమవుతుంది. దీంతో ఆమెలోకి ప్రవేశించిన జిన్ అనే దుష్టశక్తి పిల్లల రక్తం కోసం తహతహలాడుతుంది. ఇప్పుడు యాంతి తనను తాను నియంత్రించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె శరీరంలో ఉన్న శక్తి తన పిల్లలను పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది.

తల్లి ప్రాణాలను కాపాడుతూనే ఆ దుష్టశక్తి నుంచి ఆమెను విడిపించాలని విరా నిర్ణయించుకుంటుంది. మేడియా సహాయంతో ఆ ప్రమాదకరమైన ఆచారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. కానీ కథ అక్కడితో ముగియదు. చివర్లో యాంతి శరీరంలో ఉన్న శక్తి తన పిల్లలను ఎదుర్కొంటూ, తల్లిగా జీవించడం వల్ల తాను కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందాలనే కోరికను బయటపెడుతుంది. తన తల్లిని కాపాడాలా, లేక తన తమ్ముడి ప్రాణాలను రక్షించాలా అనే భయంకరమైన పరిస్థితిలో విరా చిక్కుకుంటుంది. యాంతి నిజంగా తన తల్లేనా ? చివరికి తన పిల్లలను కాపాడుకుందా ? లేక బలి ఇచ్చిందా ? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

రాండాల్ఫ్ జైనీ దర్శకత్వం వహించిన ఈ ఇండోనేషియన్ హారర్ చిత్రంలో ఆర్టికా సారీ దేవి, అరోరా రిబెరో, అలీ ఫిక్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. తల్లి – పిల్లల అనుబంధం, మానసిక సంఘర్షణ, దుష్టశక్తి, భయంకరమైన ఆచారాల చుట్టూ కథ సాగుతుంది. జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో అందుబాటులో ఉంది. అయితే తెలుగు డబ్బింగ్ లేదు. అతీంద్రియ అంశాలు కలిసిన కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.

Read Also: పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

Tags

Related News

ప్రళయాన్ని సృష్టించగల డేంజరస్ టెక్నాలజీ… అడ్డుకునేందుకు సైంటిస్ట్ ఒంటరి పోరాటం… మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

విదేశాల్లో ఇండియన్ డిప్లొమాట్ కిడ్నాప్… ప్రాణాలను పణంగా పెట్టి ఏజెంట్ సాహసం… ఎండ్లెస్ డేంజర్ మిషన్

కాలేజీ హాస్టల్‌లో వరుసగా మిస్సవుతున్న అమ్మాయిలు… సైకో కిల్లర్ మాస్ మర్డర్స్ వెనుక బిగ్ ట్విస్ట్

హైటెక్ పారిస్‌లో ఊహకందని హత్యలు… ఏఐ టెక్నాలజీతో ఆడుకుంటున్న సైకో కిల్లర్

ఆ అడవిలో చీకటి పడితే చాలు వింత శబ్దాలు… ట్రిప్ అంటేనే జడుసుకునే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్

కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి లండన్‌ వెళ్తే ఊహించని షాక్… తండ్రికి నరకం… మస్ట్ వాచ్ థ్రిల్లర్

పెళ్లి, ప్రేమంటేనే గిట్టదు.. ఏకంగా ఆ బొమ్మల కంపెనీ ఓనర్‌తోనే… ట్రెండింగ్ కొరియన్‌ సిరీస్‌ తెలుగులో

Big Stories

Advertisement
×