E-Paper
Advertisement

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ వారి వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడటమే కాకుండా ఎన్నో సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈవారం ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ లేడీ కమెడియన్ పాగల్ పవిత్ర (Paagal Pavitra)పాల్గొని సందడి చేశారు.

ఘోరమైన కారు ప్రమాదం..

ఎప్పటిలాగే వర్ష  తనదైన శైలిలోని పవిత్రను ప్రశ్నిస్తూ తనని ఆటపట్టించారు. అదేవిధంగా తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి భాగోద్వేగా ఘటనల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే పవిత్ర ఈ జీవితం ఇక నాకొద్దు అన్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు పవిత్ర సమాధానం చెబుతూ కారు యాక్సిడెంట్ (Car Accident)జరిగినప్పుడు ఈ జీవితమే వద్దనిపించిందని ఆ సమయంలో ఏడవని రోజంటూ లేదని పవిత్ర గతంలో తనకు జరిగిన కారు ప్రమాద ఘటన గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు..

Advertisement

తాను తన అక్క పిల్లలతో కలిసి సొంత ఊరికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పవిత్ర తెలిపారు. మరొక పది నిమిషాలలో ఊరికి వెళ్తాము అనే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, అప్పటికే నిద్రలో ఉన్న మేము నిద్రలోనే గట్టిగా కేకలు వేసామని ఆ ప్రమాద ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. కారు యాక్సిడెంట్ అవ్వడం ఆ కారు స్క్రాప్ కు కూడా వెళ్లిపోయింది అంటూ ఈమె తెలియజేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో భాగంగా కారులో ప్రయాణిస్తున్నటువంటి వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని కారు మొత్తం డ్యామేజ్ అయిందని గతంలో కూడా పవిత్ర వెల్లడించారు. ఇక పవిత్ర ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో కమెడియన్ గా కొనసాగుతూ సందడి చేస్తున్నారు.

Advertisement

ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని చెప్పాలి. ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా కొనసాగుతూ తనదైన శైలిలోనే ప్రేక్షకులను మెప్పించారు. ఈ కార్యక్రమంతో పాటు పవిత్ర శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం, ఫ్యామిలీ స్టార్ వంటి తదితర కార్యక్రమాలలో సందడి చేశారు. ఇలా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు ప్రస్తుతం సీరియల్స్ అలాగే సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ ఇప్పుడిప్పుడే కెరియర్ పరంగా బిజీ అవుతున్నట్లు తెలియజేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో పవిత్ర ఇంకా ఎలాంటి విషయాల గురించి చర్చించారు అనేది తెలియాలి అంటే ఆదివారం వరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×