E-Paper
Advertisement

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?
Advertisement

కొందరికి మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడుతుంటారు. లోపల అజెండా వేరుగా ఉంటుంది. బయట మరోలా కనిపిస్తుంటారు. ఇలాంటివి ఇక కాంగ్రెస్ లో చెల్లవని కొండా సురేఖ ఎపిసోడ్ తో హైకమాండ్ తేల్చేసింది. ఏకంగా మంత్రివర్గం నుంచి బరర్తఫ్ దాకా మ్యాటర్ వెళ్లింది. రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని అలాగే డీల్ చేయాలి. కొండా సురేఖ విషయమే తీసుకుంటే.. ఎంతో కాంపిటీషన్ ఉన్నప్పటికీ క్యాబినెట్ లో బెర్త్ దొరికింది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి. కానీ అలా జరగలేదు. గతంలో ఓఎస్డీ విషయంలో విమర్శలు వచ్చాయ్. వీటికి తోడు సురేఖ కూతురు వ్యవహారం పదవికే ఎసరు తెచ్చి పెట్టింది.

Advertisement

కూతురి కామెంట్లతో సంబంధం లేదు అని సింపుల్ గా చెబితే సరిపోతుందా? ప్రతిపక్షాలను కార్నర్ చేయాల్సిన చోట ఏకంగా సీఎంనే విమర్శిస్తే ఎలా..? ఒకసారి కాదు ఇది రెండోసారి కొండా సుస్మిత సీఎంను టార్గెట్ చేసి మాట్లాడారు. తొలిసారి ఇలా ఘాటు విమర్శలు చేసినప్పుడు.. కొండా సురేఖ సీన్ లోకి వచ్చి మా కుమార్తె ఏదో ఆవేశంలో మాట్లాడింది.

పోలీసులు ఇంటికి రావడంతో జరిగిన పరిణామాల వల్ల ఆందోళన చెంది సీఎం రేవంత్‌ రెడ్డిపై అలా మాట్లాడింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు బదులుగా తాను ముఖ్యమంత్రికి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఆ మాటతో అప్పుడు వివాదానికి పుల్ స్టాప్ పడింది. కానీ సుస్మిత రెండోసారి కూడా అంతకంటే ఘాటుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి అయితే కళ్లు నెత్తికెక్కాయా అని క్వశ్చన్ చేశారు. ఇలాంటప్పుడు కూడా క్షమిస్తే పార్టీలో, ప్రజల్లో అదే నెగెటివ్ ఇమేజ్ వెళ్లదా? అందుకే ఈ బర్తరఫ్ అన్న సిగ్నల్స్ ను హైకమాండ్ ఇచ్చింది.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×