E-Paper
Advertisement

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR
Advertisement

KTR Warning:రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మిర్యాలగూడలో రైతు మహాధర్నా ని నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ.ఇక మహా ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని, వచ్చే వినాయక చవితి లోపు ప్రభుత్వం నీటి విడుదలపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని అందుకోసం పది రోజుల గడువు విధిన్నామంటూ హెచ్చరించారు .

ఒకవేళ సర్కార్ గనుక దిగిరాకపోతే కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో కలిసి భారీ పాదయాత్ర చేపడతామని, గ్రామ గ్రామానా,పల్లె పల్లెనా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తేల్చి చెప్పారు.

ప్రభుత్వ చేతకానితనం వల్ల

Advertisement

ఒకప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి సాగు రికార్డు స్థాయిలో జరిగేదని, కేసీఆర్ హయాంలో రైతులు రెండు పంటలు హాయిగా పండించుకునేవారని గుర్తుచేశారు కేటీఆర్ . కానీ ఈ రోజు సాగర్‌లో నీటి మట్టం సరిపడా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్ల ఎడమ కాలువ రైతులకు చుక్క నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని తరలించి రెండు పంటలకు ప్రణాళికలు వేసిన గత అనుభవాలను ప్రస్తావిస్తూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి విడుదలపై ఎప్పుడు, ఎంత నీరు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. కళ్లముందే కష్టపడి పెంచిన పంటలు ఎండిపోతుంటే రైతులు ఊరుకోరని స్పష్టం చేశారు కేటీఆర్.

వీళ్ళిద్దరే సాగర్ కి పెద్ద శని

Advertisement

నీళ్ళ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల కళ్ళలో కన్నీళ్లు చూస్తున్నాడని, ఇక కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని SLBC ఎందుకు కూలిపోయిందో చెప్పుమంటే వాటర్ లో నీళ్ళు కలిసాయని అంటున్నాడని, వీళ్ళిద్దరే సాగర్ కి పెద్ద శని అని మండిపడ్డారు.

ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్ . రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరగనేలేదని, రైతు భరోసా, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీల భృతి, పంటలకు అదనపు బోనస్ వంటి హామీలన్నీఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు.

బాధ్యత రేవంత్ సర్కార్‌పైనే

గతంలో ఎరువుల కోసం లైన్లలో నిలబడే కష్టాలు మళ్లీ వచ్చాయని, రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు రోడ్లెక్కే పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. హామీలను నమ్మి ఓట్లేసిన రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్‌పైనే ఉందన్నారు.

ఇక సాగునీటి సాధన కోసం గతంలో కేసీఆర్ స్వయంగా పాదయాత్ర చేసి సాధించుకున్న చరిత్ర ఉందన్నారు.ప్రభుత్వం గనుక దిగిరాకపోతే మరోసారి అదే తరహా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం ఈ 10 రోజుల డెడ్‌లైన్‌పై స్పందించకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామీణ ప్రాంతాల్లో రైతులే నిలదీసేలా తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.

ALSO READ:31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

మొత్తానికి కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఇపుడు పొలిటికల్ సర్కిల్స్ లో ముఖ్యంగా నల్లగొండ జిల్లాల్లో హట్ టాపిక్ గా మారాయి.మరి కేటీఆర్ కామెంట్స్ కి సర్కార్ నుండి ఎలాంటి జవాబు వస్తుందో వేచి చూడాల్సిందే !

Tags

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×