E-Paper
Advertisement

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై పలు కార్యక్రమాలు సీరియల్స్ అలాగే సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో పాగల్ పవిత్ర ఒకరు. ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మొదటిసారి తన బ్రేకప్ గురించి అలాగే తన పట్ల వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్ల గురించి మాట్లాడారు.

నల్లగా ఉన్నానంటూ ట్రోల్స్..

ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న వర్ష (Varsha)పవిత్రను కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డిప్రెషన్ నేను భరించలేకపోతున్నాను అన్న రోజులు ఉన్నాయా అంటూ ప్రశ్న వేయడంతో పవిత్ర సమాధానం చెబుతూ.. తన స్నేహితులు చేసే కామెంట్లు తనని చాలా బాధ పెట్టాయని తెలిపారు. నా స్నేహితులలో ఉన్న అమ్మాయిలే నన్ను నల్లగా ఉన్నానని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని తెలిపారు. నా జీవితంలో ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెంట్ కాదని ఎవరితోనూ తాను పెద్దగా మాట్లాడటం లేదని తెలిపారు.

ప్రేమే భారంగా మారిపోయింది..

Advertisement

ఇక పవిత్ర లవ్ గురించి కూడా ప్రస్తావనకు రావడంతో అసలు బ్రేకప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు పవిత్ర సమాధానం చెబుతూ నాకు నాన్న లేడు. చిన్నప్పటినుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాము అందుకే నాకు వచ్చేవాడు నాన్న లాగా చూసుకోవాలని కోరుకున్నాను. చివరికి తన ప్రేమే భారంగా మారిపోయిందని, ఇలాంటివన్నీ సెట్ లోనే సెట్ అవుతాయి, రియల్ లైఫ్ లో కాదు అంటూ పవిత్ర తెలిపారు. మరి ఈమె బ్రేకప్ కి సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు చెప్పారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.

Advertisement

ఇక పవిత్ర లవ్ స్టోరీ విషయానికి వస్తే ఈమె సంతోష్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా సంతోష్ తో కలిసి నిశ్చితార్థం కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. తమ నిశ్చితార్థపు ఫోటోలను పవిత్ర సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేశారు. అయితే నిశ్చితార్థమైన కొద్ది రోజులకే ఈమె బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలియజేయడమే కాకుండా తమ నిశ్చితార్థపు ఫోటోలను కూడా డిలీట్ చేశారు. తాజాగా వీరి బ్రేకప్ కి గల కారణాలను పవిత్ర తెలియజేశారు. కేవలం వ్యక్తిగత బేధాభిప్రాయాలు కారణంగానే వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది.

Also Read: కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×