Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ వారం జబర్దస్త్ లేడీ కమెడియన్ పాగల్ పవిత్ర(Paagal Pavitra) హాజరై సందడి చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా కొనసాగుతున్న పవిత్ర తన అద్భుతమైన స్కిట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ బుల్లితెరపై మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నట్లు తెలియజేశారు. ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్న పవిత్ర తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాగల్ పవిత్ర తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ది ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) తో కలిసి పవిత్ర చేసిన రచ్చ మామూలుగా లేదని చెప్పాలి. తాజాగా ఈ కార్యక్రమం గురించి ప్రస్తావనకు రావడమే కాకుండా సుధీర్ గురించి కూడా ప్రస్తావనకు రావడంతో సుధీర్ గురించి పవిత్ర ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
సుధీర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక మంచి పొజిషన్ కు వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపిస్తారు కానీ సుధీర్ అలా కాదని పవిత్ర తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుధీర్ మా ఫాదర్ చనిపోయినప్పుడు కానీ నేను ఏదైనా కష్టాలలో ఉన్నప్పుడు నాకు చాలా సహాయం చేశారని తెలిపారు. ముఖ్యంగా మా నాన్న చనిపోయినప్పుడు వీడియో కాల్ ద్వారా నన్ను పలకరించడమే కాకుండా, ఫైనాన్షియల్ గా నాకు చాలా హెల్ప్ చేశారని పవిత్ర గుర్తు చేసుకున్నారు. ఇక సెట్ లో కూడా ప్రతి చిన్న విషయంలోనూ సుధీర్ హెల్ప్ చేస్తారని తెలిపారు.
సెట్ లోకి రాగానే తనే అందర్నీ పలకరిస్తాడు. ఒక కంటెంట్ విషయంలో కానీ, స్క్రిప్ట్ విషయంలో కానీ ఇలా చేయాలి అలా చేయాలి అంటూ చాలా బాగా హెల్ప్ చేస్తారని పవిత్ర తెలిపారు. నా క్యారెక్టర్ ఏదైనా సరే ఆ క్యారెక్టర్ బాగా చేయటానికి సుధీర్ చాలా హెల్ప్ చేస్తారని తెలిపారు. సాధారణంగా సుధీర్ ఎక్కువగా అమ్మాయితో మాట్లాడరు. కానీ నేను మాత్రం స్టేజ్ మీద కాకుండా సుదీర్ మీదే ఎక్కువగా ఉంటాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుధీర్ గురించి ఒక మాట చెప్పాలి అంటే ఏం చెబుతావు అంటూ వర్ష ప్రశ్నించడంతో వెంటనే పవిత్ర “ఐ లవ్ యూ” అని చెబుతా అంటూ తెలిపారు. అది ఎలాగైనా కావచ్చు ఒక ఫాదర్ గా, ఒక బ్రదర్ గా ,ఒక ఫ్రెండ్ గా ఏదైనా కావచ్చు సుదీర్ నుంచి మనం ఇంకా చాలా విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుందని పవిత్ర తెలిపారు. త్వరలోనే సుదీర్ ఒక మంచి సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పవిత్ర తెలిపారు.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!