E-Paper
Advertisement

నోరు జారిన వైనం.. అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో అభాసుపాలు..! ద‌ళిత స్పీక‌ర్‌పై ఇదేం వైఖ‌రి? చ‌ర్య‌ల‌కు డిమాండ్..

నోరు జారిన వైనం.. అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో అభాసుపాలు..! ద‌ళిత స్పీక‌ర్‌పై ఇదేం వైఖ‌రి? చ‌ర్య‌ల‌కు డిమాండ్..
Advertisement

తానొక్క‌టి త‌లిస్తే బీఆరెస్ నేత‌లొక‌టి చేసి పెట్టారు. కేసీఆర్ అంద‌రినీ కూర్చోబెట్టుకుని బుద్దిగా సుద్దులు చెప్పి అసెంబ్లీకి పంపితే.. ఎమ్మెల్సీ తాతా మ‌ధు త‌న నోటి దురుసు మాట‌ల‌తో మొత్తం ఆగమాగం చేసి పెట్టాడు.

బ్లాక్ టీ ష‌ర్టులు వేసుకొని, వాటిపై నినాదాలు రాసుకుని, పోలీసుల‌తో తోపులాట‌లో పోటీలు ప‌డి.. మ‌రీ బీఆరెస్ స‌భ్యులు హంగామా చేశారు. అంగీలు ఇప్పి.. బ‌నీనుల‌పై బ‌స్తీమే స‌వాల్ విసిరారు. మాట‌ల పంచులే కాదు ప‌నిలో ప‌నిగా పోలీసుల‌పై పంచులు ఇచ్చారు. పిడిగుద్దులు కురిపించారు. అంతా బాగానే అనుకున్న‌ట్టే అయ్యింది. కానీ మ‌ధ్య‌లో ఆ తాతాకు ఏమందో ఏమో.. చిట‌ప‌ట‌లాడాడు. చిర్రుబుర్రులాడాడు. నోటికేదొస్తే అది మాట్లాడేశాడు. ఎవ‌డ్రా మ‌మ్మ‌ల్ని ఆపేది..? అంటూ బూతులందుకున్నాడు.

Advertisement

ఆ బూతు ప‌దానికి ముందు స్పీక‌ర్‌నుద్దేశించి .. ఎందుకు అడ్డుకుంటున్నాడ‌ని ప్ర‌శ్నించ‌డంతో.. ఆ బూతు తిట్టు కూడా స్పీక‌ర్‌నుద్దేశించే అన్న‌ట్టైంది. దీంతో భ‌గ్గుమ‌న్నారు కాంగ్రెస్ స‌భ్యులు. ద‌ళిత స్పీక‌ర్‌పై ఇవేం మాట‌లు.. మా ద‌ళితులు లేక‌పోతే కేసీఆర్ సీఎ0 అయ్యేవాడేనా..? అని ద‌ళిత స‌భ్యులంతా క‌లిసి ధ్వ‌జ‌మెత్తారు.

స్పీక‌ర్‌ను ప‌రామ‌ర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించేది లేద‌ని, చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి స్పందించిన తీరు కూడా సంద‌ర్భోచితంగా ఉంది. నాడు త‌న‌ను, సంప‌త్‌కుమార్‌ను ఏమీ అన‌కముందే స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేశార‌ని, మ‌రి ఇలా తెగ‌బ‌డి స్పీక‌ర్నే బూతులు తిట్టే ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. వీరిపై ఎందుకు చ‌ర్య తీసుకోవ‌ద్దు..? అని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కోరారు.

Advertisement

కేసీఆర్ మీకు ఇదే ఉప‌దేశం చేసి పంపారా? అని కాంగ్రెస్‌కు చెందిన ద‌ళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆరెస్‌పై విరుచుకుప‌డుతున్నారు. అయితే, ఈ ఉప‌ద్ర‌వం నుంచి త‌ప్పించుకునేందుకు బీఆరెస్ కూడా సాకులు వెతుక్కున్న‌ది. తాతా మ‌ధు ప్యాంటును లాగార‌ని, అందుకే కోపంతో ఆ విధంగా మాట్లాడ‌డ‌ని స‌మ‌ర్థించుకునే ప‌ని చేస్తున్న‌ది గులాబీ పార్టీ.

కాగా,తొలిరోజు అసెంబ్లీలో అస‌లు విష‌యాలు ప‌క్క‌కు పోయి… తాతా మ‌ధు బూతు పురాణంపైనే ర‌చ్చ జ‌రిగింది. ఇప్ప‌టికే పాడి కౌషిక్‌పై చ‌ర్య‌ల‌కు క్ర‌మ శిక్ష‌ణా సంఘం రిపోర్డు రెడీ చేసింది. స్పీక‌ర్ వివ‌ర‌ణ కూడా తీసుకున్నారు. ఇక చ‌ర్య‌లే మిగిలున్నాయి. ఈ క్ర‌మంతో తాజాగా తాతా మధు కూడా ఇదే తోవ‌లో త‌న నోటి దురుసును బ‌య‌ట పెట్టుకున్నారు.

కేటీఆర్‌, కేసీఆర్‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు, ఎలాగైనా వైర‌ల్ కావ‌డానికి, పార్టీలో త‌మ‌ను ప్ర‌త్యేకంగా గుర్తించాల‌నే త‌ప‌న‌.. ఇలా వీరిని ప‌క్క‌దారి ప‌ట్టిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బీఆరెస్ అధిష్టానం వీరిని వెనుకేసుకు రావ‌డం కూడా ఈ అభిప్రాయాన్ని బ‌ల‌ప‌రుస్తున్న‌ది.

Tags

Related News

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!

కేసీఆర్ క్లాస్‌.. కేటీఆర్ మాస్‌! చ‌ర్చ‌ల వ్యూహం ఆయ‌న‌ది.. ర‌చ్చ చేసి ఫోక‌స్ త‌మ‌పై నిలిపే ఎత్తుగ‌డ ఈయ‌న‌ది..!

క్షణికావేశంలో ముగిసిన కుటుంబ కథ.. పశ్చిమ గోదావరిలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రగులుతున్న పోలిటికల్ వార్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్!

సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?

తెలంగాణలో ఈవీ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టులు.. టెట్ క్వాలిఫికేషన్‌పై ప్రశ్నలు

Big Stories

Advertisement
×