E-Paper
Advertisement

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!
Advertisement

Bigg Boss 10 Telugu: బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది తెలుగులో ఈ కార్యక్రమం 10 వ సీజన్ నేడు ఘనంగా  ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున హౌస్ లోకి 15 మంది కంటెస్టెంట్లను పంపించారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలతోపాటు కామనర్స్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా 15 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి సెలబ్రిటీలు ఎవరు? ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయానికి వారే

ఫస్ట్ కంటెంట్: ఫస్ట్ కంటెంట్  గా బిగ్ బాస్ హౌస్ లోకి సీరియల్ నటి దెబ్జానీ మోదక్  ఎంట్రీ ఇచ్చారు. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాల ద్వారా దెబ్జానీ వారానికి 3 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం.

Advertisement

సెకండ్ కంటెస్టెంట్: సెకండ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి నటుడు త్రిగున్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈయన పలు సినిమాలలో నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందా ఇటీవల చెన్నై లవ్ స్టోరీ లో కూడా త్రిగున్ నటించే సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నందుకు ఈయనకి వారానికి 3 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

మూడవ కంటెస్టెంట్: మూడవ కంటెస్టెంట్  గా అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక అయి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు సింగర్ ఝాన్సీ. ఈమె కామన్ మ్యాన్ క్యాటగిరి లో భాగంగా అగ్ని పరీక్ష ద్వారా ఎంపికయి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈమె కామన్ మ్యాన్ క్యాటగిరి లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమెకు కూడా వారానికి మూడు లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది

Advertisement

నాలుగవ కంటెస్టెంట్:  నాలుగవ కంటెస్టెంట్ గా ప్రముఖ యాంకర్ సుధీర్ రెడ్డి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు . యాంకర్ గా హోస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా వారానికి 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఐదవ కంటెస్టెంట్: ఐదవ కంటెస్టెంట్ గా అమన్ మసూద్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్ష ద్వారా ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని కంటెస్టెంట్ గా హౌస్ లో పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో అమన్ మసూద్ వారానికి మూడు 3 రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఆరవ కంటెస్టెంట్: ఆరవ కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటి చైత్ర రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అష్టా చమ్మ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె 10 నెలల బిడ్డను వదిలి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చైత్ర ఒక వారానికి 2.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

ఏడవ కంటెస్టెంట్: ఏడవ కంటెస్టెంట్  గా బిగ్ బాస్ హౌస్ లోకి జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈయన ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో రాంప్రసాద్ ఒక వారా 3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎనిమిదవ కంటెస్టెంట్: ఎనిమిదవ కంటెస్టెంట్ గా శాలిని పటేల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరక్ష ద్వారా ఎంపికైన శాలిని హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శాలిని ఒక వారానికి 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

తొమ్మిదవ కంటెస్టెంట్: 9వ కంటెస్టెంట్ గా బిగ్బాస్ హౌస్ లోకి నటుడు టెంపర్ వంశీ ఎంట్రీ ఇచ్చారు. ఇక టెంపర్ వంశీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను వారానికి 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

పదవ కంటెస్టెంట్: పదవ కంటెస్టెంట్ గా అగ్ని పరీక్షలో ఫైనల్ వరకు చేరిన శ్రష్టి వ్యాకరణం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈమెను  శ్రీముఖి కంటెస్టెంట్ గా ఎంపిక చేసింది. ఈమె కూడా వారానికి 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

11వ కంటెస్టెంట్: 11వ కంటెస్టెంట్  గా బిగ్ బాస్ హౌస్ లోకి జబర్దస్త్ నరేష్ ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ వారానికి 2.25 రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

12 వ కంటెస్టెంట్: 12వ కంటెస్టెంట్  బిగ్ బాస్ హౌస్ లోకి ఆర్ జె చరణ్ మహదేవ్ ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్షలు మెరిసిన ఈయన ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్న చరణ్ వారానికి 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం.

13 వ కంటెస్టెంట్: 13వ కంటెస్టెంట్ గా సినీ నటుడు కృష్ణుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు వినాయకుడు అనే సినిమాతో ఫేమస్ అయిన కృష్ణుడు పలు సినిమాలలో నటించారు.. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నందుకు ఈయన వారానికి 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం.

14 వ కంటెస్టెంట్: 14 వ కంటెస్టెంట్  బిగ్ బాస్ హౌస్ లోకి ప్రముఖ యాంకర్, నటి వర్షిని సౌందరరాజన్ ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమాలలో సందడి చేస్తున్న వర్షిని ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనడం కోసం వారానికి 3 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

15 వ కంటెస్టెంట్: 15వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ రోహిత్ నాయుడు ఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపిక అయిన రోహిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారానికి 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

16 వ కంటెస్టెంట్: 16వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ్ ఎంట్రీ ఇచ్చారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వారానికి 4 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ సీజన్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్ ముఖేష్ గౌడ్ అని తెలుస్తుంది.

Also Read: గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

Related News

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

Big Stories

Advertisement
×