E-Paper
Advertisement

Big tv kissik talks promo: నా ఉసురు తగలకుండా పోదు.. రీతూ శాపనార్థాలు ఆమెకేనా?

Big tv kissik talks promo: నా ఉసురు తగలకుండా పోదు.. రీతూ శాపనార్థాలు ఆమెకేనా?
Advertisement

Big tv kissik talks promo: తెలుగు బుల్లితెర నటిగా పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో రీతు చౌదరి ఒకరు. పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం జబర్దస్త్ ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉండే రీతు సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణను సొంతం చేసుకోవడంతో ఈమె బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) రియాలిటీ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 12 వారాల పాటు కొనసాగిన రీతు చౌదరి అనంతరం ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ఈమె వరుస బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ధర్మా మహేష్ తో రీతూ చౌదరి…

ఇలా కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్న రీతు చౌదరి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కెరియర్ గురించి అలాగే సోషల్ మీడియాలో తన పట్ల వస్తున్న విమర్శల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఈమెకు సంబంధించి గౌతమి(Gauthami) చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన భర్త ధర్మ మహేష్ (Dharma Mahesh)తో రీతు చౌదరి కలిసి ఉన్న వీడియోలను ఈమె షేర్ చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఈ విషయం గురించి ఈ కార్యక్రమంలో ప్రస్తావనకు రావడంతో రీతు విభిన్న రీతిలో స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు.

కర్మఫలం అనుభవిస్తారు..

Advertisement

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసి నేను చాలా షాక్ అయిపోయానని తెలిపారు . అయితే ఎవరైతే వారి అటెన్షన్ కోసం నా పేరును ఇలా వాడుకున్నారో వాళ్లకు నేనేమీ చెప్పనని కర్మ వెంటాడుతుందని తెలిపారు. ఇప్పటివరకు అనవసరంగా నన్ను బాధ పెట్టిన ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని ,కచ్చితంగా ఏడ్చారని ఇప్పుడు కూడా కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది అంటూ రీతు శాపనార్థాలు పెట్టారు. రీతు చేసిన ఈ కామెంట్స్ మహేష్ భార్య గౌతమిని ఉద్దేశించి అని స్పష్టమవుతుంది. మరి రీతు ఈ వ్యవహారం గురించి ఇంకా ఎలాంటి విషయాలను మాట్లాడారు, ఏంటి అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన ఫ్యామిలీ విషయాల గురించి కూడా రీతూ చౌదరి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు తమ ఫ్యామిలీకి ఎవరూ లేరని, తనకోసం ఎవరు కూడా రారు అంటూ ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

Also Read: MSVPG Success Celebrations: మెగా విక్టరీ  బ్లాక్ బస్టర్… సెలబ్రేషన్స్ లో శంకర ప్రసాద్ గారు!

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×