E-Paper
Advertisement

KTM RC 160 vs Bajaj Pulsar RS 200: KTM RC 160 vs బజాజ్ పల్సర్ RS 200.. స్పెక్స్, మైలేజ్ లో ఏది బెస్ట్ అంటే?

KTM RC 160 vs Bajaj Pulsar RS 200: KTM RC 160 vs బజాజ్ పల్సర్ RS 200..  స్పెక్స్, మైలేజ్ లో ఏది బెస్ట్ అంటే?
Advertisement

KTM ఇండియన్ మార్కెట్ లోకి కొత్త RC 160ని ప్రారంభించింది. దీని ధర రూ. 1,85,000గా నిర్ణయించింది. 200cc కంటే తక్కువ స్పోర్ట్‌ బైక్ విభాగంలో ఇది బజాజ్ పల్సర్ RS 200కి గట్టి పోటీ ఇస్తోంది.  RS 200 ధర రూ. 1,71,153గా ఉంది. ఈ రెండింటిలో ఏది మెరుగైన స్పోర్ట్‌ బైక్‌ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంజన్ పనితీరు

KTM RC 160 బైక్ 162.4cc, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 9,500 rpm దగ్గర 19PS పవర్ ను ప్రొడ్యూస్ చేసింది. అటు 7,500 rpm దగ్గర 15.5Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. బజాజ్ పల్సర్ RS 200 199.5cc, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. 9,750 rpm దగ్గర 24.5 PS పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 8,000 rpm దగ్గర 18.7Nm టార్క్ ను ఇస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. KTM RC 160 పల్సర్ కంటే బెస్ట్ పని తీరును కలిగి ఉంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Advertisement

ఇక రెండు బైక్‌ల బ్రేకింగ్ సెటప్ సమానంగా ఉంటుంది. కానీ, KTM మెరుగైన బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే ఇది తక్కువ బరువు, పెద్ద బ్రేక్‌లను కలిగి ఉంటుంది. బజాజ్ పల్సర్ RS200 అనేది KTM RC 160 కంటే ప్రైమరీగా పెద్ద బైక్. రైడ్‌ ను సులభతరం చేస్తుంది. KTM తక్కువ సెట్ క్లిప్ ఆన్ హ్యాండిల్‌ బార్లు, వెనుక సెట్ ఫుట్‌పెగ్‌లు, మంచి రైడింగ్ పొజిషన్‌తో  మంచి ఎర్గోనామిక్స్‌ ను కలిగి ఉంది.  లేటెస్ట్ అండర్‌పిన్నింగ్‌లు,  సరైన స్పోర్ట్‌ బైక్ డైనమిక్స్‌ తో KTM బజాజ్ కంటే మెరుగైన హ్యాండ్లర్‌గా ఉంటుంది.  ఇక KTM తక్కువ కెర్బ్ బరువు కారణంగా తేలికగా ఉంటుంది. 13.75-లీటర్ సామర్థ్యంతో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. బజాజ్ పల్సర్ RS200తో పోలిస్తే పెద్దగా ఉంటుంది. దీనికంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఫీచర్ సెట్ రెండు బైక్‌లలో ఒకే విధంగా ఉంటుంది. RC లో స్విచ్ చేయగల ABS మాత్రమే ఉన్నప్పటికీ, RSలో 3 ABS మోడ్‌లు ఉన్నాయి. ఇవి ABS జోక్యం స్థాయిని మాడ్యులేట్ చేస్తాయి.

రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

రెండు బైక్ ల ధరల విషయానికి వస్తే KTM RC 160 ధర రూ. 1,85,000గా ఉంటుంది. బజాజ్ పల్సర్ RS 200 ధర రూ. 1,71,153గా ఉంది. KTM కంటే పల్సర్ రూ. 15,000 చౌకైనది. KTM మంచి పని తీరును కలిగి ఉంటుంది. RS 200 హైవే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. పవర్ ఫుల్ పనితీరు కావాలంటే RS తీసుకోవడం బెస్ట్. కొంచెం తక్కువ స్పెక్స్‌,  షార్ఫ్ హ్యాండ్లింగ్‌  కావాలనుకుంటే RC బెస్ట్.

Advertisement

Read Also: హోండా యునికార్న్ VS SP 160.. రెండింటిలో ఏది కొంటే మంచిదంటే?

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×