E-Paper
Advertisement

MSVPG Success Celebrations: మెగా విక్టరీ  బ్లాక్ బస్టర్… సెలబ్రేషన్స్ లో శంకర ప్రసాద్ గారు!

MSVPG Success Celebrations: మెగా విక్టరీ  బ్లాక్ బస్టర్… సెలబ్రేషన్స్ లో శంకర ప్రసాద్ గారు!
Advertisement

MSVPG Success Celebrations: సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా వరుస సినిమాలు విడుదల అవుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నాయి. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమాలలో చిరంజీవి(Chiranjeevi) నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా కూడా ఉంది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా వందకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగా విక్టరీ సెలబ్రేషన్స్..

ఇలా ఈ సినిమాకు రెండు రోజులలోనే ఊహించని విధంగా కలెక్షన్లు వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విక్టరీ వెంకటేష్ (Venkatesh)కూడా హాజరు కావడం విశేషం. ఇలా చిత్ర బృందం మొత్తం ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని కేక్ కట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

సెలబ్రేషన్స్ లో సందడి చేసిన రామ్ చరణ్.

Advertisement

ఈ వేడుక చిరంజీవి ఇంట్లో జరగడంతో రామ్ చరణ్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కూడా నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకోవడంతో మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇక వెంకటేష్ కూడా క్యామియో పాత్రలో కనిపించి సందడి చేశారు.

వెంకీ గౌడ పాత్రలో వెంకటేష్..

Advertisement

వెంకటేష్ సుమారు 25 నిమిషాల పాటు వెంకీ గౌడ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇలా చిరంజీవి వెంకటేష్ మధ్య వచ్చే ఈ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో మెగా విక్టరీ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా మంచి సక్సెస్ కావడంతో అనిల్ కెరియర్లో ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి. ఈ సినిమా అనిల్ రావిపుడికి తొమ్మిదవ సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈయన పదవ సినిమా ఏ హీరోతో ఉండబోతుందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Also Read: AA 23 Announcement Video:  ఇట్స్ అఫీషియల్.. లోకేష్ కనగరాజ్ తో బన్నీ సినిమా ఫిక్స్..  వీడియో వైరల్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×